Monday, May 20, 2024
- Advertisement -

అజేయ భారత్…సెమీస్‌లో ఏం చేస్తారో?

- Advertisement -

వన్డే ప్రపంచకప్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లకు తొమ్మిది మ్యాచ్‌ల్లో విజయం సాధించింది రోహిత్ సేన. ఆదివారం నామమాత్రమైన మ్యాచ్‌లో నెదర్లాండ్‌ని చిత్తు చేసింది భారత్. 160 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

411 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్‌…47.5 ఓవర్లలో 250 పరుగులకే ఆలౌట్‌ అయింది. మ్యాక్స్‌ ఓడౌడ్‌ (30), కొలిన్‌ అకర్‌మన్‌ (35) ,సిబ్రండ్‌(45),ఎడ్వర్డ్స్‌ (17) ,తేజ నిడమనూరు ( 54) పర్వాలేదనిపించారు. అయితే ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా భారీ స్కోరు సాధించకలేకపోవడంతో నెదర్లాడ్ ఓటమి తప్పలేదు.

ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లు కొల్పోయి 410 పరుగులు చేసింది. శ్రేయాస్ అయ్యర్ 128 పరుగులతో నాటౌట్‌గా నిలవగా కేఎల్ రాహుల్ 64 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. గిల్ 51, రోహత్ 61,విరాట్ 51 పరుగులు చేయడంతో భారత్ భారీ స్కోరు సాధించింది.శ్రేయాస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -