మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని పదేపదే చెప్పే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజంగానే మార్పు తెచ్చారు. అదేంటంటే పక్క పార్టీలో యాక్టివ్‌గా ఉన్న నేతలకు జనసేన టికెట్లు ఇవ్వడం. టీడీపీ – బీజేపీ పొత్తులో భాగంగా జనసేన 21 అసెంబ్లీ,2 ఎంపీ స్థానాలకు పోటీ చేస్తుండగా 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.కేవలం రెండు స్థానాలు అవనిగడ్డ,పాలకొండ రెండు పెండింగ్‌లో పెట్టారు.
ఈ రెండు స్థానాలను సర్వేల పేరిట పెండింగ్‌లో పెట్టి చివరకు టీడీపీ నేతలకు టికెట్లు కట్టబెట్టేందుకు రెడీ అయ్యారు పవన్. పిఠాపురంలో మండలి బుద్దప్రసాద్, నిమ్మక జయకృష్ణ పవన్ ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. దీంతో అవనిగడ్డ నుండి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్, పాలకొండ నుండి నిమ్మక జయకృష్ణను బరిలో దిగడం దాదాపు ఖరారైంది.
అవనిగడ్డ నుండి మూడు సార్లు విజయం సాధించారు మండలి బుద్దప్రసాద్. ఈసారి బుద్దప్రసాద్ అవనిగడ్డ నుండి పోటీ చేయడం దాదాపు ఖరారు కాగా పాలకొండ నుండి నిమ్మక జయకృష్ణ పోటీ చేయడం దాదాపు ఖరారు కాగా దీనిపై అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది.