- Advertisement -

తెలంగాణలో జనసేనకు దక్కిన సీట్లు.. ఓట్లు..!!

- Advertisement -

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. తెలంగాణ లో కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాల పైన ఆయన స్పందించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ పైన స్పష్టత ఇచ్చారు. అయితే.. జనసేన ఇప్పటికే తెలంగాణలో పోటీ చేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పోటీ చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో అసలు జనసేనకు తెలంగాణలో దక్కిన సీట్లు.. ఓట్లు ఏంటనే చర్చ ఆసక్తి కరంగా మారింది.

జనసేన అధినేత పవన్ తాజాగా తెలంగాణలో తమ పార్టీ ప్రయాణం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తుందని స్పష్టం చేసారు. బీజేపీ పొత్తు లేకుండా పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారని.. జనసేన సైతం పొత్తు లేకుండానే ఎన్నికల బరిలో ఉంటుందని తేల్చి చెప్పారు. అయితే, జనసేన కొత్తగా ఎన్నికల బరిలోకి దిగటం లేదని.. 2023 ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేస్తున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ – జనసేన పొత్తుతో ఎన్నికల్లో పోటీ చేసాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్న తెలంగాణలో బీజేపీ 111 సీట్లు.. జనసేన 8 స్థానాల్లో పోటీ చేసింది. కాగా, ఆ ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ 14.32 శాతం ఓట్లతో 32,57,511 ఓట్లు దక్కించుకుంది. అదే విధంగా జనసేన పోటీ చేసిన 8 స్థానాల్లో 0.26 శాతం ఓట్లతో 59,001 ఓట్లు సాధించింది.

కాగా, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 336 వార్డుల్లో పోటీలో నిలిచింది. నిజామాబాద్ లో 48, మహబూబ్ నగర్ లో 44, కొత్తగూడెంలో 22, మహబూబ్ నగర్ లో 5, రంగారెడ్డిలో 21, మెదక్ లో 18, ఖమ్మంలో 17, కరీంనగర్ లో 56, వరంగల్ లో 20, అదిలాబాద్ లో 39, నల్గొండలో 46 వార్డుల్లో జనసేన అభ్యర్ధులు బరిలో నిలిచారు. జనసేన స్థానికంగా ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగింది. కాగా.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నేరేడుచర్ల మున్సిపాలిటీలో మాత్రమే పార్టీ తరఫున ఒక స్థానం దక్కింది. ఇక్కడ స్థానిక సమీకరణాల్లో భాగంగా సీపీఎం, బీఆర్ఎస్ పార్టీల మద్దతుతో కలిసి పోటీ చేసిన జనసేన అభ్యర్థి విజయం సాధించారు. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలు.. ఎన్నికల్లో పోటీ పైన పవన్ ప్రకటన వేళ ఈ లెక్కలు మరో సారి రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణంగా నిలుస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -