- Advertisement -

గుడివాడలో కొడాలి నాని వారసుడొచ్చాడు..!!

- Advertisement -

వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. గుడివాడలో నాని వారసుడు ఎంట్రీ ఇచ్చాడు. గతంలోనే తన వారసుడు గురించి కొడాలి నాని ప్రకటన చేసారు. తాను 2029 ఎన్నికల్లో పోటీ చేయనని.. తన సోదరుడు కుమారుడు పార్టీలో క్రియాశీలకంగా మారుతారని ప్రకటించారు. కాగా.. ఇప్పుడు ఇందు లో మార్పు జరిగింది. వారసుడు ఎంట్రీ ఇచ్చినా.. 2029 ఎన్నికల్లో మాత్రం కొడాలి నాని వైసీపీ అభ్యర్దిగా గుడివాడ నుంచి పోటీ చేయనున్నారు. ఈ మేరకు పూర్తి క్లారిటీ వచ్చేసింది.

గుడివాడ కేంద్రంగా రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. 2024 ఎన్నికల్లో ఓటమి తరువాత కొడాలి నాని అనారోగ్య కారణాలతో పార్టీ వ్యవహారాలకు కొంత కాలం దూరంగా ఉన్నారు. తరువాత పార్టీ సమావేశాలు.. మాజీ సీఎం జగన్ వద్ద భేటీలకు హాజరయ్యారు. కాగా.. గతంలో తాను 2024 ఎన్నికల్లో చివరి సారిగా పోటీ చేస్తున్నానని.. 2029 లో పోటీ చేయనని కొడాలి నాని ప్రకటించారు. కొడాలి నానికి ఇద్దరు కుమార్తెలు. తన సోదరుడు కుమారుడు అర్జున్ రాజకీయంగా కొనసాగుతారని చెప్పుకొచ్చారు. తాజాగా నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో సర్ (SIR) సమావేశం జరిగింది. అందులో అర్జున్ పార్టీ నేతలతో కలిసి వేదిక పంచుకున్నారు. పార్టీ నేత.. పేర్ని నాని ఈ సమయం లో కీలక ప్రకటన చేసారు. కొడాలి నాని వారసుడిగా అర్జున్ ఉంటారని ప్రకటించారు. అయితే, 2029 ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చారు.

2034 ఎన్నికల్లో అర్జున్ పోటీ చేస్తారని వెల్లడించారు. కాగా, కొడాలి నాని కొద్ది రోజుల క్రితం మాజీ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో అర్జున్ వ్యవహారం పైన చర్చించారు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నాని బరిలో నిలవాలని జగన్ స్పష్టం చేసారు. ఆ తరువాత జరిగే ఎన్నికల్లో వారసుడికి అవకాశం ఇద్దామని.. వచ్చే ఎన్నికల్లో మాత్రం పోటీకి సిద్దం అయ్యేలా నియోజకవర్గం లో యాక్టివ్ కావాలని నిర్దేశించారు. దీంతో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరిలో కొడాలి నాని పోటీకి సిద్దం అవుతున్నారు. కొడాలి అర్జున్ మరెవరో కాదు.. కొడాలి నాని సోదరుడి కుమారుడు. గత కొంతకాలంగా ఆయన గుడివాడ వైఎస్సార్‌సీపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. మరోవైపు ఈ సదస్సులో ఓట్ల తొలగింపు ప్రక్రియ పై కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తమిళనాడులో స్టాలిన్, పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీలు ఈ ‘సర్’ ప్రక్రియ వల్లే ఓడిపోయా రని (వారు పోటీ చేసిన నియోజకవర్గాల్లో ఓట్లు తొలగించడం వల్ల) నాని పేర్కొన్నారు. అందుకే వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల జాబితా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -