Monday, May 5, 2025
- Advertisement -

డబ్బు కొట్టు..జాబ్ పట్టు..ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు ఎంతో తెలుసా!

- Advertisement -

ఏపీలో ఉద్యోగాలు అమ్ముకుంటున్నారా?,టీడీపీ నేతలపై వైసీపీ నేత చేసిన ఆరోపణల్లో నిజం ఉందా?, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అక్రమాలపై సంచలన కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.

నియోజకవర్గంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సోమిరెడ్డి రూ. మూడు లక్షలు డిమాండ్ చేశారని బీజేపీ నేత పెంచలయ్య ఆరోపించగా దీనిపై స్పందించిన కాకాణి.. తన వద్ద అంత డబ్బులు లేవని చెప్పినా.. సోమిరెడ్డి కనికరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ పనులను పరిశీలించడం, కాంటాక్టర్లను బెదిరించి మామూళ్లు వసూలు చేయడం సోమిరెడ్డికి అలవాటుగా మారిందరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎన్‌జె డిస్టీలరీస్ నుంచి నేను మామూళ్లు తీసుకున్నానని సోమిరెడ్డి ఆరోపించారు. దమ్ముంటే నిరూపించాలిని కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి స‌వాల్ చేశారు. త్వరలోనే సోమిరెడ్డి చేసే అవినీతి పనులకు సంబంధించి ఒక రికార్డును విడుదల చేస్తామని చెప్పారు.

పెంచలయ్య ఆరోపణలపై వెంకటాచలం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆయన వీడియోను ఫార్వర్డ్ చేసినందుకు నాపై A2గా కేసు పెట్టారని గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు., అంగన్వాడి, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలకు డబ్బులు తీసుకున్నారు నిజం కాదా అన్నారు. ఇప్పుడు ఉద్యోగుల బదిలీలకు కూడా డబ్బులు తీసుకుంటున్నారని …లే అవుట్లకు డబ్బులు తీసుకుని అనుమతులు ఇస్తున్నారన్నారు కాకాణి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -