Monday, June 17, 2024
- Advertisement -

బ్లడ్ శాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం..కాకాని సవాల్

- Advertisement -

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో తన హస్తం ఉందని వస్తున్న వార్తలపై మరోసారి స్పందించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తనపై ఆరోపణలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.బ్లడ్ శ్యాంపిల్ ఇచ్చేందుకు సిద్ధం కావాలని సోమిరెడ్డికి సవాల్ చేశానని చెప్పారు.

తన పాస్ పోర్ట్ కారులో దొరికిందని సోమిరెడ్డి చెప్పారు…కానీ తన పాస్ పోర్ట్ తన వద్దే ఉందని చెప్పారు.కారులో దొరికిందని చెబుతున్న పాస్ పోర్టు ఎవరి దగ్గర ఉందని నిలదీశారు.సోమిరెడ్డి దీనిపై సమాధానం చెప్పాలని కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.

ఆ కారు తుమ్మల వెంకటేశ్వర రావు పేరుతో ఉందని.. స్టిక్కర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశానని అన్నారు. పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారని, సోమిరెడ్డి రాజకీయ జీవితమే చీకటి కోణం అని విమర్శించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -