Saturday, April 27, 2024
- Advertisement -

2 సార్లు గెలుపు..5 సార్లు ఓటమి!

- Advertisement -

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆయనది ప్రత్యేక శైలీ. పదునైన మాటలతో ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడం ఆయన నైజం. అయితే ప్రత్యర్థి పార్టీలను తిట్టడం వరకు ఓకే కానీ ప్రజాక్షేత్రంలో పెద్దగా పట్టు సంపాదించుకోలేకపోయారు. టీడీపీ ఆవిర్భావం నుండి ఉన్న ఆ నేత గెలిచింది రెండు సార్లే. కానీ ఓడిపోయింది వరుసగా ఆరు సార్లు. అయితే ఆ నేత ఇప్పుడు టీడీపీ మూడో జాబితాలో టికెట్ దక్కించుకున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరనుకుంటున్నారా ఆయనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.

టీడీపీ ఆవిర్భావం నుండి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు సోమిరెడ్డి.1994,1999లో రెండు సార్లు గెలిచిన సోమిరెడ్డి…చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. ఇక 1999లోనే ఆయన చివరిసారిగా గెలిచింది .ఆ తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికలోనూ ఓటమి పాలయ్యారు. 2004,2009,2014,2019లో అలాగే 2012లో కొవ్వూరు ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయితే 2014లో టీడీపీ అధికారంలో ఉండటంతో ఎమ్మెల్సీగా ఎన్నికై మంత్రి పదవిని దక్కించుకున్నారు. .

బలమైన రెడ్డి నేతగా పేరు తెచ్చుకోవడం ఒకటైతే పార్టీకి గట్టి అభ్యర్థులు లేకపోవడం, సామాజిక సమీకరణాలు ఆయనకు టికెట్ దక్కేలా చేశాయి. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్వేపల్లి నుండి టికెట్ దక్కించుకున్న సోమిరెడ్డి ఈసారైన గెలుపు జెండా ఎగరేస్తారా అన్నది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఓడిపోతే ఇవే ఆయనకు చివరి ఎన్నికలు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే 5 సార్లు ఓడిన నేతకు టికెట్ ఇచ్చి తమకు టికెట్ నిరాకరించడంపై కొంతమంది సీనియర్లు పెదవి విరుస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -