- Advertisement -

క్రికెట్‌కు కేన్ రిచర్డ్‌సన్‌ గుడ్‌ బై

- Advertisement -

ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కేన్ రిచర్డ్సన్ (34) ప్రొఫెషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు ప్రకటించారు. ఆయన ఆస్ట్రేలియా తరఫున 25 వన్డేలు, 36 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు. అలాగే 2021 టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నారు.

దేశవాళీ క్రికెట్‌లో నార్తర్న్ టెరిటరీ, సౌత్ ఆస్ట్రేలియా జట్లకు ప్రాతినిధ్యం వహించిన రిచర్డ్సన్, 2008–09 సీజన్‌లో లిస్ట్-ఏ క్రికెట్‌లో అరంగేట్రం చేశారు. ఆయన అంతర్జాతీయ అరంగేట్రం 2013లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా జరిగింది.

బిగ్ బాష్ లీగ్ (BBL)లో రిచర్డ్సన్‌కు అద్భుతమైన కెరీర్ ఉంది. ఇప్పటివరకు జరిగిన ప్రతి సీజన్‌లో ఆడిన కొద్దిమంది ఆటగాళ్లలో ఆయన ఒకరు. తొలుత అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ఆరు సీజన్లు ఆడిన ఆయన, 2017–18 నుంచి మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఎనిమిది సీజన్లు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2025–26 సీజన్‌కు ముందు సిడ్నీ సిక్సర్స్‌తో ఒక ఏడాది ఒప్పందం కుదుర్చుకున్నారు. బీబీఎల్‌లో మొత్తం 142 వికెట్లతో ఐదో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కెరీర్ ముగించారు.

వివిధ దేశాల్లోని ఫ్రాంచైజీ లీగ్‌ల్లో కూడా రిచర్డ్సన్ ఆడారు. ఇందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా ఉంది. 2009లో నా అరంగేట్రం నుంచి ఇప్పటివరకు నేను నాలో ఉన్న ప్రతీ శక్తిని క్రికెట్‌కు అంకితం చేశాను. జీవితంలోని ఈ అందమైన అధ్యాయాన్ని ముగించడానికి ఇదే సరైన సమయం అని భావిస్తున్నాను అని రిచర్డ్‌సన్‌ అన్నారు.

నా దేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఫ్రాంచైజీ జట్లకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం నా అదృష్టం. చిన్నప్పటి నుంచి డార్విన్‌లో క్రికెటర్ కావాలనే కలతోనే ఎదిగాను. ఆ అవకాశాన్ని ఎప్పుడూ తేలికగా తీసుకోలేదు అని ఆయన పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -