- Advertisement -

భారత్-ఈయూ ట్రేడ్ ఒప్పందం..డిటైల్స్!

- Advertisement -

భారత్-ఈయూ మధ్య ట్రేడ్ ఒప్పందం కుదిరింది. ఈ ట్రేడ్ డీల్‌లో భాగంగా లగ్జరీ కార్ల ధరలు తగ్గనున్నాయి. ఈయూ దేశాల నుంచి దిగుమతయ్యే కార్లపై టారిఫ్ 110 నుంచి 10 శాతానికి తగ్గించారు. దీంతో యూరోపియన్ కార్లు, బీరు, అనేక ఆహార పదార్థాలు తగ్గనున్నాయి. ఏడాది 4 బిలియన్ యూరోలు ఆదా కానున్నాయి.

భారత్ మరియు యూరోపియన్ యూనియన్ (EU) మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రశంసించారు. ఇది భాగస్వామ్య సౌభాగ్యానికి కొత్త బ్లూప్రింట్ అని పేర్కొన్నారు. ఈ ఒప్పందాన్ని చారిత్రకమైన రోజుగా అభివర్ణించిన ప్రధాని, 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌తో భారత్ కుదుర్చుకున్న అతిపెద్ద FTA వాణిజ్యం, భద్రత, ప్రజల మధ్య సంబంధాల్లో కొత్త అధ్యాయాన్ని తెరుస్తుందని అన్నారు.

నేడు భారత్ తన చరిత్రలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసింది. జనవరి 27న భారత్ 27 యూరోపియన్ దేశాలతో ఈ FTAపై సంతకం చేసింది. ఇది పెట్టుబడులను పెంచుతుంది, కొత్త ఆవిష్కరణ భాగస్వామ్యాలను ఏర్పరుస్తుంది, ప్రపంచ స్థాయిలో సరఫరా గొలుసులను బలోపేతం చేస్తుంది. ఇది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, భాగస్వామ్య సౌభాగ్యానికి ఒక బ్లూప్రింట్ అని ప్రధాని మోదీ తెలిపారు.

ఈ FTA ద్వారా 27 దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్‌కు భారత్ ఎగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. భారత్ ప్రధాన ఎగుమతుల్లో డీజిల్, ATF వంటి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ (స్మార్ట్‌ఫోన్లు), వస్త్రాలు, యంత్రాలు, కంప్యూటర్లు, ఆర్గానిక్ కెమికల్స్, ఇనుము–ఉక్కు, రత్నాలు–ఆభరణాలు, ఔషధాలు, ఆటో విడిభాగాలు ఉన్నాయి.

ప్రస్తుతం భారత్ నుంచి EUకి వెళ్లే టెక్స్టైల్స్‌పై 12–16 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలకు EU ఒప్పందాల ద్వారా ప్రాధాన్య మార్కెట్ యాక్సెస్ ఉండటంతో భారత్ పోటీలో వెనుకబడుతోందని GTRI నివేదిక పేర్కొంది.

EU నుంచి భారత్ దిగుమతుల్లో యంత్రాలు, కంప్యూటర్లు (టర్బోజెట్లు సహా), ఎలక్ట్రానిక్స్, విమానాలు, వైద్య పరికరాలు, శాస్త్రీయ పరికరాలు, రఫ్ డైమండ్స్, ప్లాస్టిక్స్, ఇనుము–ఉక్కు, కార్లు, ఆటో విడిభాగాలు ఉన్నాయి.ఈ రంగంలో రెండు ప్రాంతాలూ కీలకమైనవి. 2023–24లో EUకి భారత్ ఎగుమతుల్లో వైన్‌లు (1.5 మిలియన్ డాలర్లు), బ్లెండెడ్ విస్కీలు, వోడ్కా, బ్రాండీ, లిక్కర్లు (64.9 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.EU నుంచి భారత్ దిగుమతుల్లో వైన్‌లు (412.4 మిలియన్ డాలర్లు), బ్లెండెడ్ విస్కీలు, బ్రాండీ, జిన్, టెకీలా, వోడ్కా, లిక్కర్లు (22.3 మిలియన్ డాలర్లు) ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -