- Advertisement -

కర్ణాటక సీఎం సిద్ధూ రాజీనామా?

- Advertisement -

కర్ణాటకలో సీఎం పదవి మార్పు అనివార్యమేనా..?కొంతకాలంగా సీఎం సిద్దరామయ్య,డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్‌కు ఎండ్ కార్డు పడినట్లేనా అంటూ అవుననే సమాధానం వినిపిస్తోంది.

ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానం…సిద్దరామయ్య,డీకేతో దాదాపు ఆరు గంటల పాటు సుదీర్ఘ చర్చల అనంతరం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇవాళ మంత్రులతో సీఎం సిద్ధరామయ్య బ్రేక్ ఫాస్ట్ మీటింగ్, మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్లో డీసీఎం డీకే శివకుమార్ పాల్గొనే అవకాశం ఉంది.

కాంగ్రెస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రేపు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేయనుండగా మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడనున్నారు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ రణదీప్ సూర్జె వాలా.జాతీయస్థాయిలో కీలక ఓబీసీ ఫేస్ గా సిద్ధ రామయ్యకు ప్రాధాన్యత కల్పిస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

రాజ్యసభకు ఎంపిక చేసి ప్రతిపక్ష నేతగా చేస్తామని హామీ ఇచ్చినట్లు సమచారం. అలాగే సిద్ధ రామయ్య తనయుడికి క్యాబినెట్లో చోటు కల్పిస్తామని ప్రతిపాదించగా సిద్దూ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో గాంధీ కుటుంబానికి విధేయుడుగా ఉన్న డీకే శివకుమార్ కు పట్టం కట్టనుంది కాంగ్రెస్.

పార్టీ విధేయుడిగా అప్పగించిన లక్ష్యాలను నెరవేర్చే నిర్వాహకుడిగా డీకే కు అధిష్టానం వద్ద మంచి పేరు ఉంది. అలాగే ఈడి వేధింపులు, రాజకీయ ఇబ్బందులు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ కు విధేయత కనబర్చారు డీకే. అలాగే తన చిరకాల కోరిక సీఎం కావాలనే ఆశను నెరవేర్చుకోనున్నారు శివకుమార్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -