- Advertisement -

పానీపూరి లవర్స్‌కు షాక్..ఒకేసారి 15 మంది!

- Advertisement -

జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక బండి వద్ద పానీపూరి తిని ఒకేసారి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు.. పోలీసుల కథనం ప్రకారం పట్టణానికి చెందిన కొంతమంది స్నేహితురాళ్లు మంగళవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పానీపూరి తినడానికి వెళ్లారు. అక్కడ పానీపూరి తిన్న కొద్దిసేపటికే ఒక్కొక్కరికి వరుసగా కడుపునొప్పి.. వాంతులు.. విరేచనాలు మొదలయ్యాయి. బాధితుల పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించారు.

పానీపూరి తయారీలో కలుషిత నీరు.. నాణ్యతలేని పదార్థాలను ఉపయోగించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కోలుకున్న కొంతమందిని వైద్యులు ఇళ్లకు పంపించివేశారు. ప్రస్తుతం భవిత.. ప్రసన్నతార.. అశ్విని కుమారి.. సుచిత.. మణికుమారి అనే యువతులు ఆసుపత్రిలో చేరి ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. బాధితులకు ప్రస్తుతం ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు అయిజ ఎస్సై మల్లేశ్ తెలిపారు. సదరు పానీపూరి బండిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించామని.. పదార్థాల నాణ్యతపై పూర్తి విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.

బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేక్షావలి ఆచారి.. నాయకులు మహబూబ్‌పాషా.. మద్దిలేటి.. పాండురంగ ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న యువతులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో వీధి వ్యాపారులు.. హోటళ్ల నిర్వాహకులు ఆహార పదార్థాల తయారీలో పరిశుభ్రత పాటించేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -