Saturday, May 4, 2024
- Advertisement -

తెలంగాణ సీఎంకు కొడాలి నాని పంచ్..

- Advertisement -

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి నెల రోజులు పూర్తిచేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని. సీఎం అయ్యాక తనకు ఏపీ సీఎం జగన్ ఫోన్ చేయలేదని రేవంత్ వ్యాఖ్యానించగా …దీనికి కౌంటర్ ఇచ్చారు నాని. రేవంత్ రెడ్డికి ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారని గుర్తుచేసిన నాని.. ఫోన్ ఎందుకు చేయాలి, ఎందుకు కలవాలంటూ ప్రశ్నించారు.

కేసీఆర్‌కు తొంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ పరామర్శించారని.. రేవంత్ రెడ్డికి అలా ఏమీ విరగలేదు కదా అంటూ ఘాటుగా స్పందించారు నాని. రేవంత్ రెడ్డి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అని.. పక్క రాష్ట్రాల సీఎంలను పట్టించుకునేంత సమయం తమకు లేదన్నారు. రేవంత్ కి ఫోన్ చేసి చెప్పడానికి తాము కాంగ్రెస్ పార్టీలో లేమన్నారు. రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కావాలంటే డైరెక్ట్‌గా సోనియా గాంధీని, రాహుల్‌ను కలుస్తామని.. అప్పుడు ఆయనే అపాయింట్మెంట్ ఇస్తారంటూ వ్యాంగ్యాస్త్రాలు సంధించారు.

ఏపీలో చంద్రబాబును గెలిపించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే దానిని చేసే వ్యక్తి రేవంత్ అని దుయ్యబట్టారు నాని. ఏపీలో రాజకీయాలపై అంత ఇంట్రెస్ట్ ఉంటే.. ముఖ్యమంత్రి పదవి వదిలేసి ఇక్కడి కాంగ్రెస్‌కు ప్రెసిండెంట్ కావాలని హితవు పలికారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -