Tuesday, April 30, 2024
- Advertisement -

వైరల్‌గా వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్?

- Advertisement -

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనుండగా సీఎం జగన్‌ దూకుడు మీదున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాగా ఇవాళ మూడో జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికతో పాటు ఎంపీ అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారట జగన్. జాతీయ స్థాయిలో కీలకం కావాలంటే ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకోవాల్సి అవసరం ఉండటంతో ఆ దిశగా అభ్యర్థులను ఎంపిక చేశారు జగన్.

ఇప్పటికే సిట్టింగ్గుల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పంపగా మరికొందరిని తప్పించి కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఓ లిస్ట్ వైరల్‌గా మారింది. 2019లో శ్రీకాకుళం నుండి దువ్వాడ శ్రీనివాస్ బరిలో దిగగా ఈ సారి తమ్మినేని సీతారం,దానేటి శ్రీధర్,పిరియా విజయ,కిల్లి కృపారాణి పేర్లను పరిశీలిస్తున్నారు జగన్. విజయనగరం నుండి చంద్రశేఖర్ సిట్టింగ్‌ ఎంపీగా ఉండగా మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యానారాయణ పేర్లు పరిశీలిస్తున్నారట. అలాగే విశాఖ పట్నం ఎంపీగా ఎవవీపీ సత్యనారాయణ ఉండగా బొత్స ఝాన్సీ పేరును పరిగణలోకి తీసుకుంటున్నారు.

అరకు – గొడ్డేటి మాధవి సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఈ స్థానం నుండి పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మీ పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. అనకాపల్లి నుండి బీవీ సత్యవతి సిట్టింగ్ ఎంపీగా ఉండగా కరణం ధర్మక్ష పేరును పరిశీలిస్తున్నారు. కాకినాడ నుండి వంగా గీత సిట్టింగ్ ఎంపీగా ఉండగా చలమలశెట్టి సునీల్ పేరును, అమలాపురం – చింతా అనురాధ సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఎలీజా పేరును, రాజమండ్రి – మార్గాని భరత్, సిట్టింగ్ ఎంపీగా ఉండగా డాక్టర్ అనుసూరి పద్మలత(శెట్టిబలిజ సామాజికవర్గం) పేరును పరిశీలిస్తున్నారు.

నరసాపురం – రఘురామకృష్ణంరాజు, సిట్టింగ్ ఎంపీ కాగా గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు పేర్లను, ఏలూరు – కోటగిరి శ్రీధర్, సిట్టింగ్ ఎంపీగా ఉండగా ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ(మంత్రి) పేరును, మచిలీపట్నం – వల్లభనేని బాలశౌరి సిట్టింగ్ ఎంపీగా ఉండగా డైరెక్టర్ వివి వినాయక్ పేరును, విజయవాడ – పీవీపీ పోటీ చేయగా అక్కినేని నాగార్జున, వసంత కృష్ణప్రసాద్(మైలవరం ఎమ్మెల్యే) పేర్లు పరిశీలిస్తున్నారు జగన్. గుంటూరు – మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పోటీ చేయగా లావు శ్రీకృష్ణదేవరాయులు(నరసరావు పేట ఎంపీ) పేరును, నరసారావుపేట – లావు శ్రీకృష్ణదేవరాయులు సిట్టింగ్ ఎంపీగా ఉండగా మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి పేరును, బాపట్ల నుండి నందిగం సురేష్‌కు మరోసారి ఛాన్స్ ఇవ్వనున్నారు జగన్.

ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు, సిట్టింగ్ ఎంపీ కాగా వై.విక్రాంత్‌రెడ్డి(వైవీ సుబ్బారెడ్డి కుమారుడు), మద్దిశెట్టి వేణుగోపాల్(దర్శి ఎమ్మెల్యే) పేరును, నంద్యాల – పోచా బ్రహ్మానందరెడ్డి, సిట్టింగ్ ఎంపీ స్ధానంలో అలీ పేరును, కర్నూలు – సంజీవ్‌కుమార్, సిట్టింగ్ ఎంపీ స్థానంలో గుమ్మనూరి జయరాం(మంత్రి) పేరును, అనంతపురం – తలారి రంగయ్య స్థానంలో శంకరనారాయణ పేరు ఖరారైంది. హిందూపురం – గోరంట్ల మాధవ్ స్థానంలో జే.శాంతమ్మ, కడప – వైఎస్ అవినాశ్‌రెడ్డి, నెల్లూరు – ఆదాల ప్రభాకర్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తిరుపతి – డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీనే,రాజంపేట – మిథున్‌రెడ్డి, సిట్టింగ్ ఎంపీ,చిత్తూరు – ఎస్.రెడ్డప్ప, సిట్టింగ్ ఎంపీనే కొనసాగించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -