దేశభక్తి గురించి పవన్ కళ్యాణ్ పాఠాలు చెప్పాల్సిన పనిలేదు మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో మాట్లాడిన కేటీఆర్… పవన్ కళ్యాణ్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నిజాం సర్కారుకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు కదం తొక్కిన నేల తెలంగాణ అన్నారు. సోదరుడిగా వస్తే ఇంటికి పిలిచి హైదరాబాద్ బిర్యానీ పెడతా కానీ, సెక్రటేరియట్ లో కూర్చుని పెత్తనం చేస్తామంటే ఒప్పుకోం అని తేల్చిచెప్పారు.
ప్రాంతీయవాదం అంటున్న పవన్ కళ్యాణ్ మరి మద్రాసు నుంచి వేరుపడాలని పొట్టి శ్రీరాములు చేసింది ఏంటి…?..దాన్ని కూడా ప్రాంతీయ వాదం అంటారా..? చెప్పాలన్నారు. ప్రధాని మోడీ తెలంగాణ పెట్టుబడులు గుజరాత్‌కు తీసుకెళ్తున్నారు.. మరి దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తారా..? తెలంగాణ 4 కోట్ల భూమి పుత్రుల జాగీరు ఇది…నెత్తురుతో తడిచిన నేల ఇది.. ఇది తెలంగాణ ప్రజల జాగీరేనని పవన్‌కు చురకలు అంటించారు.
తెలంగాణ ఏర్పాటు నాకు ఇష్టం లేదని సీదా చెప్పకుండా ఉల్టా మాటలు ఎందుకు పవన్ కళ్యాణ్… 11 రోజులు అన్నం తినకుండా ఉంటే.. తెలంగాణ ఆవిర్భావం రోజు మీటింగ్ ఎందుకు..? చెప్పాలన్నారు. తెలంగాణలో జనసేన కొత్తగా పోటీ చేసేది ఏముంది…తెలంగాణకు వచ్చి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలి అన్నారు. ఇదేదో ఆషామాషీ రాష్ట్రం కాదు.. వేల మంది బలిదానాల మధ్య ఏర్పడిన రాష్ట్రం…పవన్ కళ్యాణ్ ను ఎవరు అడ్డుకున్నారు..? చెప్పాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రోత భాష మీద కేసులుండవా..?… మా జెండా దిమ్మెలు కూల్చాలని సీఎం పిలుపునివ్వడం హింస కాదా..?, కేసీఆర్ చావు కోరుకుంటూ, కేసీఆర్ మీద మాట్లాడే దరిద్రపు భాష మీద ఎన్ని కేసులు పెట్టాలి..?..రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అందరికీ ఒకేలా ఉండాలి అన్నారు.
