Sunday, May 4, 2025
- Advertisement -

సిబిల్ స్కోర్ ఎంత పనిచేసింది..ఏకంగా!

- Advertisement -

సిబిల్ స్కోరు అందరికి తెలిసిందే. ముఖ్యంగా వ్యక్తుల ఆర్థిక పరిస్థితిని,గృహ రుణం, వ్యక్తిగత రుణం, క్రెడిట్‌ కార్డు వంటి వాటిని ఆ వ్యక్తి ఎలా నిర్వహిస్తున్నారో డేటాను సేకరించి, క్రెడిట్‌ స్కోరును లెక్కిస్తుంది. బ్యాంకులు రుణాలు ఇచ్చే ముందు ఈ క్రెడిట్‌ స్కోరును పరిశీలించి లోన్స్ ఇస్తుంటాయి. అంతేగాదు క్రెడిట్ స్కోరు ఆధారంగా లోన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇదే క్రెడిట్ స్కోరు ఏకంగా ఓ పెళ్లినే ఆపేసింది.

వినడానికి వింతగా ఉన్నా మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని ముర్తిజాపూర్‌కు చెందిన ఓ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పెద్దలు పెళ్లి సంబంధం కుదిర్చారు. అంతేగాదు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయింది.

అయితే వివాహానికి కొన్ని రోజుల ముందు వధువు మేనమామ వరుడి సిబిల్‌ స్కోర్‌ను చెక్‌ చేయగా, అతడు అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నట్లు గుర్తించారు. అంతేకాకుండా సిబిల్‌ స్కోర్‌ కూడా తక్కువ ఉండడంతో వారు ఈ పెళ్లిని వెంటనే నిరాకరించారు. ఇప్పటికే అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆ యువకుడు తమ అమ్మాయికి ఆర్థిక భద్రతను ఎలా కల్పించగలడు ? అని వివాహం రద్దు చేసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

వధువు కుటుంబం తీసుకున్న నిర్ణయంపై సోషల్‌ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. పెళ్లి అంటే అటు ఏడు తరాలు … ఇటు ఏడు తరాలను చూడాలని పెద్దలంటారు కానీ ఇప్పుడు ట్రెండ్ మారి సిబిల్ స్కోర్ ఉంటే చాలు అనేదగ్గరికి వచ్చిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -