Friday, May 17, 2024
- Advertisement -

పవన్‌ని ఓడించి తీరుతా..ముద్రగడ సవాల్

- Advertisement -

పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఓడించి తీరుతానని సవాల్ విసిరారు మాజీమంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. మీడియాతో మాట్లాడిన ఆయన…పవన్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఛాలెంజ్ విసిరారు. అంతేగాదు పవన్‌ని ఓడించకపోతే తన పేరును పద్మానభంగా కాదు పద్మనాభరెడ్డి అని మార్చుకుంటానని వెల్లడించారు.

పవన్‌కు డబ్బు వ్యామోహం తప్ప, ప్రజా సమస్యల గురించి ఆలోచన లేదన్నారు. ఇతరులను ఎలా గౌరవించాలో పవన్‌కు తెలియదన్నారు. పవన్ కల్యాణ్ అర్థంపద్దం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎవరైపా పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతానని… రంగువేసుకుని వస్తే ఓట్లు వేయరని చురక అంటించారు. పాలిటిక్స్‌కు పవన్ త్వరలోనే ప్యాకప్ చెప్పడం ఖాయమని, ఎన్నికల తర్వాత పవన్‌ తిరిగి సినిమాల్లో వెళ్లడం ఖాయమన్నారు. రైతులకు సహాయం చేయడానికి తీసుకున్న చందాల్లో ఎంత వినియోగించారో సమాధానం చెప్పాలని…పవన్‌కు రాజకీయ ఆదాయమే బాగుందని ఎద్దేవా చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -