Tuesday, May 21, 2024
- Advertisement -

ఆ నాలుగు స్థానాల్లో గెలుపెవరిది?

- Advertisement -

ఏపీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఏ స్థానంలో ఎవరు గెలుస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పార్వతీపునం మన్యం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు రిజర్వ్ కాగా ఇక్కడ ఎవరు గెలుస్తారోనని ఉత్కంఠ నెలకొంది. సాలూరు, కురుపాం, పాలకొండలు ఎస్టీలకు, పార్వతీపురం నాలుగు స్థానాలను దక్కించుకుంది వైసీపీ.

ఈ నియోజకవర్గాల్లో 7,83,440 మంది ఓటర్లు ఉండగా పురుషులు 3,22,589, మహిళలు 4,00,779, థర్డ్ జెండర్ 72 మంది ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ నాలుగు స్థానాలను గెలుచుకున్న వైసీపీ ఈసారి అవే ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది.

కురుపాంలో, మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి రెండుసార్లు గెలవగా ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. పాలకొండలో 2014, 2019లో రెండుసార్లు గెలిచిన కళావతి కూడా హ్యాట్రిక్‌ కోసం ప్రయత్నిస్తుండగా.. జనసేన పార్టీకి చెందిన ఎన్‌.జయకృష్ణతో తలపడుతున్నారు.

సాలూరులో ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) ప్రజాన్న దొర 2004 నుండి గెలుస్తు వస్తుండగా ఈసారి జి.సంధ్యారాణితో తలపడుతున్నారు. పార్వతీపురం(ఎస్సీ)లో ఎమ్మెల్యే ఏజోగారావు రెండోసారి పోటీ చేయగా ఆయనపై టీడీపీ నుంచి బి విజయచంద్ర పోటీ చేస్తున్నారు. అధికార వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తుండగా కూటమి బలంతో గట్టెక్కుతామని టీడీపీ అభ్యర్థులు భావిస్తున్నారు. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గుచూపుతారన్నది తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -