Tuesday, May 6, 2025
- Advertisement -

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్

- Advertisement -

తమిళనాడు బీజేపీ చీఫ్‌గా నైనార్ నాగేంద్రన్ ఎన్నికయ్యారు. బీజేపీ తమిళనాడు కొత్త అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ పేరును ఆ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు కె.అన్నామలై ప్రతిపాదించారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమే కానుంది.

వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగాల్సి ఉండగా అన్నాడీఎంకే, బీజేపీ మధ్య మరోసారి పొత్తు కుదిరింది. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా తిరునెల్వేలి నుంచి నాగేంద్రన్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అన్నాడీఎంకే నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు నాగేంద్రన్.

2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి రెండు సార్లూ ఓడిపోయారు. 2001-2006 మధ్య మంత్రి పదవిలో కొనసాగారు. 2017లో అన్నాడీఎంకేకు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఇటీవల రామేశ్వరంలో జరిగిన పాంబన్‌ వంతెన కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు నాగేంద్రన్ వేదికపై కనిపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -