Monday, May 6, 2024
- Advertisement -

దక్షిణాదిన ఒంటరవుతున్న బీజేపీ!

- Advertisement -

బీజేపీ అంటే ఉత్తరాది పార్టీ అనే ముద్రపడిపోయింది. ఎందుకంటే దక్షిణాదిన ఒక్క కర్ణాటకలో తప్ప మిగితా ఏ రాష్ట్రాల్లో అంతగా ప్రాబల్యం లేదు. ఇక రీసెంట్‌గా కర్ణాటకలో అధికారాన్ని కొల్పోయి ప్రతిపక్షానికే పరిమితమైంది బీజేపీ. కేరళలో మతం పేరుతో కుళ్లు రాజకీయాలు చేయడానికి ప్రయత్నిస్తే ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఇవ్వలేదు కమలనాథులకు. ఇక బీజేపీ అంతోఇంతో మెరుగ్గా ఉందంటే. అది తెలంగాణ,ఏపీ, తమిళనాడులో.

ఈ మూడు రాష్ట్రాల్లో కూడా పొత్తు ఉంటే ఒకటో రెండో సీట్లు వచ్చే పరిస్థితి. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం ఒంటరిపోరుకే కమలం నేతలు సిద్ధమవుతుండగా తమిళనాడులో మాత్రం ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగిస్తూ వచ్చింది. జయలలిత మరణం తర్వాత తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీ నేతలు గట్టిగానే ప్రయత్నించారు. కానీ తమిళ ప్రజల ముందు ఆ పార్టీ పప్పు ఉడకలేదు.

ఇక తాజాగా త్వరలోనే ఎంపీ ఎలక్షన్స్ రానుండా అన్నాడీఎంకేతో కలిసి పోటీచేసి రెండు లేదా మూడు ఎంపీ స్థానాల్లో గెలవాలని భావించింది బీజేపీ. కానీ బీజేపీకి షాకిస్తూ నిర్ణయం తీసుకుంది అన్నాడీఎంకే. బీజేపీతో పొత్తు ఉండదని బాంబ్ పేల్చింది అన్నాడీఎంకే. ద్రావిడ నాయకుడు సి.ఎన్. అన్నాదురైని విమర్శిస్తూ బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడు కె. అన్నామలై చేసిన వ్యాఖ్యలపై అన్నాడీఎంకే నాయకుడు డి.జయకుమార్ మండిపడ్డారు. అన్నామలై, దివంగత ముఖ్యమంత్రి జె. జయలలిత సహా అన్నాడీఎంకే నేతలపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తే తమ పార్టీ కార్యకర్తలు సహించరని హెచ్చరించారు. మీ ఓటు బ్యాంకు ఏంటో మీకు తెలుసు. మా వల్లే మీకు తమిళనాడులో ఉనికి ఏర్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో దక్షిణాదిన పట్టుకోసం ఎంతోకాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ నేతలకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -