Tuesday, May 21, 2024
- Advertisement -

సినిమాలు శుక్రవారం..టీడీపీ ఆందోళనలు శనివారం!

- Advertisement -

మాములుగా ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. అయితే ఈ శనివారం టీడీపీ ఆందోళనలు ఏంటనుకుంటున్నారా?చంద్రబాబు అరెస్ట్ తర్వాత వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇందులో భాగంగా ప్రతి శనివారం ఏదో కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. శనివారం జోరే మోత మోగిద్దాం, మళ్లీ శనివారం రోజే కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే వీటన్నింటికి ప్రజల నుండి వచ్చిన రెస్పాన్స్ శూన్యమనే చెప్పాలి.

ఇక రెండు రోజుల క్రితం కాంతితో క్రాంతి కార్యక్రమం అయితే అట్టర్ ఫ్లాప్‌గా మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ఈ శనివారం ఏం కార్యక్రమం చేపడతారోనని టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తుండగా ట్రోలర్స్ సైతం టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు కౌంటర్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. అయితే ఈ శనివారం టీడీపీ చేపట్టే కార్యక్రమం ఏలా ఉన్న సరిగ్గా ఒకరోజు ముందు అంటే శుక్రవారం..చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది సుప్రీం కోర్టు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ చేయనుండగా దీనిని బట్టి కార్యక్రమాన్ని ఖరారు చేస్తారా లేదా శనివారం కార్యక్రమాన్ని ముందుగానే అనౌన్స్ చేయనున్నారా అన్నది తెలియాల్సి ఉంది.

అయితే ఇప్పటివరకు టీడీపీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజా స్పందన పక్కనపెడితే జనం మాత్రం నవ్వుకున్నారు. మోతమోగిద్దాం అంటే టీడీపీ నేతలపైనే కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చింది. ఇక కాంతితో క్రాంతి అనే కార్యక్రమం అయితే కనీసం టీడీపీ నేతలే చెప్పుకోలేని విధంగా అట్టర్ ఫ్లాప్ అయింది. ఒకనొకదశలో నెటిజన్లు టీడీపీకి ఇలాంటి క్రేజీ ఐడియాలు ఎవరిస్తున్నారని ట్రోల్ కూడా చేశారు. ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అయిన నేపథ్యంలో ఈ శనివారం టీడీపీ అనౌన్స్‌చేయబోయే కార్యక్రమంపై అల్‌రెడీ ట్రోలింగ్ నడుస్తోంది. ఈ శనివారం విడుదల అందరూ రెడీగా ఉండండి, కాదు మళ్లీ శనివారానికి వాయిదా అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదిఏమైనా చంద్రబాబు ఉన్నప్పుడు అన్ని తానై చూసుకుంటూ వేరే వారికి అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అదే ఆయన కొంప ముంచుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -