Saturday, May 4, 2024
- Advertisement -

త్రిష పెళ్లి చేసుకునే వరకు పుకార్లు ఆపేలా లేరు!

- Advertisement -

హీరోలతో సమానంగా గుర్తింపు తెచ్చుకున్నహీరోయిన్‌లలో త్రిష ఒకరు. అందం, అభినయం రెండు కలబోసిన త్రిష మోడలింగ్ రంగం నుండి వచ్చి వెండి తెరపై తళుక్కుమంది. మిస్ చెన్నైగా, మిస్ ఇండియా పోటీల్లో మిస్ స్మైల్‌గా ఎంపికైన ఈ బ్యూటి టాలీవుడ్, కోలీవుడ్ అగ్రహీరోలందరితో నటించి మెప్పించింది. ఇక గతంలో ఓ బిజినెస్‌మెన్‌ తో ఎంగేజ్‌మెంట్ జరిగి తర్వాత బ్రేకప్ కూడా అయింది.

తర్వాత తన కెరీర్‌పై దృష్టి సారించింది. రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌గా హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న ఎన్నోసార్లు ఆమె పెళ్లిపై వార్తలు రావడం, దానిని ఆమె ఖండిస్తూ వస్తూనే ఉంది.

అయితే రీసెంట్‌గా వచ్చిన పెళ్లి పుకార్లపై ఘాటుగా స్పందించింది. నిజం చెప్పాలంటే రూమర్‌లను పట్టించుకోను, కానీ అది కుటుంబ సభ్యులైన స్నేహితులతో లింక్ అయి ఉన్నప్పుడు మాత్రం మాట్లాడక తప్పనిసరి పరిస్థితి అని తెలిపింది. వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో నాకు కనెక్షన్ పెట్టి పెళ్లి వార్తలు రాస్తున్నారు ఇదేం జర్నలిజం అని ప్రశ్నించింది. నా సినీ కెరీర్ లో నాకు ఎన్నో సార్లు పెళ్లి చేశారు. కొందరు అయితే, నన్ను తల్లిని కూడా చేశారు. ఎందుకు ఇలా చేస్తారో నాకు ఇప్పటికీ అర్ధం కాదు అని చెప్పుకొచ్చింది. కొంతమంది కావాలనే ఉద్దేశపూర్వకంగా, పెయిడ్ బాట్స్ ద్వారా ఈ పని చేస్తున్నారు..అలాంటి వారికి కాలమే సరైన సమాధానం చెబుతుందని శాపనార్థాలు కూడా పెట్టేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -