టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారి రాజ్యసభలో ఖాళీ కాబోతుంది. 1983లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి రాలేదు. వాస్తవానికి 2019లో జగన్ సునామీలో కొట్టుకుపోయింది టీడీపీ. ఆ పార్టీ చరిత్రలోనే ఘోర ఓటమిని మూటగట్టుకుంది. కేవలం 23 స్థానాలకే టీడీపీ పరిమితం కాగా తాజాగా రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతోంది.
ప్రస్తుతం టీడీపీకి ఒకే ఒక రాజ్యసభ సభ్యుడు కనకమేడల ఉండగా ఏప్రిల్ 2తో పదవీకాలం ముగియనుంది. ఈ నెల 27న ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా మూడుకు మూడు వైసీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. ఎందుకంటే రాజ్యసభ ఎంపీ స్థానాన్ని గెలిచే బలం టీడీపీకి లేదు. రాజ్యసభ సీటును గెలుచుకోవాలంటే కనీసం 44 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం. ఈ లెక్కన టీడీపీకి కొత్తగా రాజ్యసభ సీటు దక్కడం కష్టమే.
అయితే రెబల్ ఎమ్మెల్యేలు, వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే తాము గెలుస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే అది అంత ఈజీ అయ్యే పనికాదు. దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయాలి. సో టీడీపీ ఆవిర్భావం తర్వాత రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోతుండటం తెలుగు తమ్ముళ్లను కలవరానికి గురి చేస్తోంది.