Monday, May 5, 2025
- Advertisement -

పరిటాల వర్సెస్ సత్యకుమార్..ధర్మవరంలో హైటెన్షన్!

- Advertisement -

ధర్మవరం ఈ పేరు వింటే గుర్తుకొచ్చేది ‘గుడ్ మార్నింగ్ ధర్మవరం’. ప్రజా సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే దిశగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేపట్టిన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం మంచి ఫలితాన్ని ఇవ్వగా ప్రజల నుండి కూడా విశేష స్పందన వచ్చింది. అయితే గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు కేతిరెడ్డి.

అప్పటినుండి ధర్మవరం పరిస్థితులు మారిపోయాయి. వాస్తవానికి ఈ సీటును ఆశీంచారు పరిటాల శ్రీరామ్. కానీ పొత్తులో బీజేపీకి కేటాయించడంతో ఆ పార్టీ గెలుపుకోసం శ్రీరామ్ పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ గెలిచి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితి టీడీపీ వర్సెస్ బీజేపీ ఓ రకంగా చెప్పాలంటే పరిటాల శ్రీరామ్ వర్సెస్ సత్యకుమార్‌గా మారిపోయింది. తాజాగా ధర్మవరం మున్సిపల్ కమిషనర్‌గా మల్లికార్జునను నియమించారు మంత్రి సత్యకుమార్. అంతే టీడీపీ నేతలు భగ్గుమన్నారు. ఏకంగా మంత్రిని అడ్డుకుని నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో మంత్రి అక్కడి నుండి వెళ్లిపోయినా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

గతంలో మల్లికార్జున వైసీపీకి అనుకూలంగా పనిచేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా సమర్ధవంతమైన అధికారి కాబట్టే నియమించామన్నారు సత్యకుమార్. గతంలో ఆయన తప్పులు చేసినట్లు ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని అని చెబుతూనే
మల్లికార్జున సమర్ధవంతమైన అధికారి అన్నారు మంత్రి సత్యకుమార్ యాదవ్ . ఆయనకు అవార్డ్ వచ్చిందని కూడా గుర్తుచేశారు. ధర్మవరంలో సమర్థవంతమైన అధికారి ఉంటే అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందని మంత్రి చెబుతుంటే టీడీపీ నేతలు మాత్రం తమ సొంత ఏజెండాతో ముందుకు వెళ్తున్నారు. మరి టీడీపీ వర్సెస్ బీజేపీగా మారిన ధర్మవరం నియోజకవర్గంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -