Sunday, May 19, 2024
- Advertisement -

చంద్రబాబు కళ్లలో ఆనందం కోసమేనా పవన్‌?

- Advertisement -

బావ కళ్లలో ఆనందం కోసమే..ఈ డైలాగ్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై అవగాహన ఉన్న వారికి పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు ఇదే డైలాగ్ కాస్త అటు ఇటుగా మార్చి చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం అని వినిపిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత పవన్ వేస్తున్న ఫీట్లు చూస్తే ఇప్పుడు ఇదు అనుమానం రాక మానదు.

ఎందుకంటే 2019 ఎన్నికల తర్వాత ఎన్డీయే కూటమిలో చేరిన పవన్…ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చంద్రబాబు పంతన చేరిపోయారు. ఇంతకాలం తనను నమ్ముకున్నబీజేపీకి హ్యాండిచ్చి చంద్రబాబే ముఖ్యమనుకున్నారు. అందుకే బీజేపీతో సంబంధం లేకుండా రాజమండ్రి వేదికగా టీడీపీ, జనసేన పొత్తును ప్రకటించి, బీజేపీ కలిసి వచ్చినా, రానుకున్నా..తాను మాత్రం బాబుతోనే అంటూ క్లియర్‌గా చెప్పేశారు పవన్.

చంద్రబాబు అరెస్టులో కేంద్రం పాత్ర ఉందని అటూ టీడీపీ, ఇటు పవన్ .. బీజేపీ దూరం జరిగే ప్రయత్నం చేశారు. ఇక 2019 ఎన్నికల్లో బాబును తీవ్రంగా వ్యతిరేకించిన పవనే నేడు ఆయనను మించిన నాయకుడు లేడని ప్రొజెక్టు చేసే పరిస్థితి వచ్చింది. బాబును మెప్పించడానికి పవన్ పడుతున్న తాపయత్రం చూసి టీడీపీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. బీజేపీతో దోస్తి కంటే టీడీపీ అనుభవమే ఏపీకి ముఖ్యమని చెబుతున్న ఇందులో పవన్ స్వార్ధం కూడా ఉంది.

ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టడమే పవన్ ముందున్న ఏకైక ఏజెండా. దీనికి జగనే టార్గెట్, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఎన్ని రీజన్స్ చెప్పినా ప్రజలకు మాత్రం క్లీయర్ కట్‌గా అర్ధమైంది కూడా ఇదే. అందుకే నాడు ఏ ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్ కోసం బాబును దూరం పెట్టారో, ఇప్పుడు ఎందుకు కలిశారో తెలియనంత అమాయకులు కాదు ప్రజలు. అందుకే బాబు కళ్లలో ఆనందం కోసం పవన్‌ పడుతున్న తాపత్రయం చూసి అంతా నవ్వుకుంటున్నారు.ఇక ఈ ఎపిసోడ్ మధ్యలో ఓసారి ఎన్డీయే కూటమి నుండి బయటకు వచ్చానని..మరోవైపు ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని పవన్ చెబుతుండటం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -