ప్రపంచకప్‌లో బోణి కొట్టింది పాకిస్థాన్. ఉప్పల్ వేదికగా నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో విజయం సాధించింది. పాక్ విధించిన 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్ 205 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్ బ్యాట్స్‌మెన్‌లలో బాస్ డి లీడ్ 67,విక్రమ్ జిత్ సింగ్ 52 పరుగులతో రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ అంతా విఫలమయ్యారు. దీంతో నెదర్లాండ్ ఓటమి ఖాయం కాగా పాక్ తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి మెరుగైన రన్‌రేట్ సాధించింది.
ఇక అంతకముందు తొలుత టాస్ గెలిచిన నెదర్లాండ్…పాకిస్థాన్ ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. 12 ఏళ్ల తర్వా త వన్డే వరల్డ్‌కప్ ఆడుతున్న నెదర్లాండ్స్ బౌలింగ్‌లో పాక్ ను వణికించింది. దీంతో 49 ఓవర్లలో 286 పరుగులకు పాక్ ఆలౌటైంది. రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68), నవాజ్ (39), షాదాబ్ (32) రాణించగా కెప్టెన్ బాబర్ అజామ్ మరోసారి విఫలమయ్యారు.
ప్రపంచక్‌పల్లో పాక్ నుంచి రెండో అత్యధిక స్కోరు (68) నమోదు చేసిన వికెట్ కీపర్‌గా రిజ్వాన్ రెండో స్ధానంలో ఉన్నారు. సర్ఫరాజ్ (2015లో 101 నాటౌట్) టాప్‌లో ఉన్నాడు. 39వేల సీటింగ్ కెపాసిటీ ఉన్న ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు 9వేల మంది ప్రేక్షకులు మాత్రమే హాజరయ్యారు.
