Saturday, May 4, 2024
- Advertisement -

పవన్..కేఏ పాల్ సేమ్ టూ సే మా!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణతో పాటు ఏపీలో పవన్ పార్టీ పోటీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పవన్ వ్యవహారిస్తున్న తీరు ప్రజల చేత నవ్వులు తెప్పిస్తోంది. అంతేగాదు ఒక అడుగు ముందుకెస్తే పవన్ తీరు కేఏ పాల్‌ని తలపిస్తోందని మాట్లాకుంటున్న పరిస్థితి నెలకొంది.

కేఏ పాల్…పొలిటికల్ కామెడీ స్టార్. ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు, చేసే చేష్టలు నవ్వురాని వారి చేత కూడా నవ్వు తెప్పిస్తుంది. తెలుగు రాష్ట్రాలకు లక్ష కోట్లు తెస్తానని, ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతానని ప్రతిసారి చెబుతారు కానీ తీరా రిజల్ట్స్ చూస్తే ఆయనకు డిపాజిట్ కూడా రాదు. ఎందుకంటే ఆయన వ్యవహార శైలీ, మాటతీరు అలాంటిది.

ఇక ఇప్పుడు పవన్ తీరు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. రాజకీయం అంటే విలువలు ఉండాలి కానీ పవన్‌ని చూస్తుంటే విలువలు లేని వ్యక్తిగా మారుతున్న విధానాన్ని చూస్తుంటే ఆశ్చర్యం కలిగించక మానదు. ఏపీలో తెలుగు దేశంతో పొత్తు, తెలంగాణలో బీజేపీతో పొత్తు పవన్ స్ట్రాటజీ ఏంటో అర్దం కాక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు.

ఏపీలో సింగిల్‌గా పోటీ చేస్తామని ప్రకటించి జనసేన నేతల్లో ఆశలు పెంచి తీరా టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు పవన్. ఇక తెలంగాణలో కూడా అంతే 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించి కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకున్నారు. ఇప్పుడు ఏపీలో కూడా టీడీపీ ఎన్ని సీట్లు ఇస్తారో తెలియని పరిస్థితి. దీంతో పవన్‌ వ్యవహార శైలీ కేఏ పాల్‌ని తలపిస్తుందని ఆ పార్టీ నేతలే మాట్లాడుతున్న సిచ్యువేషన్ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -