Monday, May 20, 2024
- Advertisement -

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి..మళ్లీ చూడలేము!

- Advertisement -

క్రికెట్ చరిత్రలోనే తొలిసారి…అది వరల్డ్ కప్‌లో ఓ బ్యాట్స్‌మెన్ ఇప్పటివరకు ఔట్ కాని విధంగా పెవిలియన్ బాటపట్టారు. అది శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మ్యాథ్యూస్. హెల్మెట్ సరిగా లేకపోవడంతో నిర్ణీత సమయంలో క్రీజులోకి రాలేకపోయారు మాథ్యూస్.దీంతో బంగ్లా బ్యాట్స్‌మెన్ అప్పీలు మేరకు టైమ్డ్ ఔట్‌గా ప్రకటించారు అంపైర్లు. దీంతో విస్తుపోవడం శ్రీలంక ఆటగాళ్ల వంతైంది.

ఇది క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఔట్. ఇప్పటివరకు క్లీన్ బౌల్డ్, ఎల్బీడబ్ల్యూ, క్యాచ్ ఔట్, రనౌట్, స్టంప్‍‌ఔట్ రూపంలో బ్యాటర్లు పెవిలియన్ చేరడం చూస్తుంటాం కానీ టైమ్డ్ ఔట్ రూపంలో ఓ ఆటగాడు పెవిలియన్ బాటపట్టడం ఇదే తొలిసారి. బహుశా మరోసారి క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఔట్ చూడమేమో.

ఇక ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఔటైన వారి వివరాలను చూస్తే…1877లో తొలిసారిగా ఓ బ్యాటర్ క్యాచ్ ఔటై పెవిలియన్ చేరాడు. అదే ఏడాదిలోనే తొలి క్లీన్ బౌల్డ్ కూడా చోటుచేసుకుంది. రిటైర్డ్ హర్ట్‌గా ఓ ప్లేయర్ వెనుదిరగడం కూడా 1877లోనే చోటు చేసుకుంది. హిట్ వికెట్ లాంటి అరుదైన ఘటన మాత్రం 1884లో జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -