- Advertisement -

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు..సీఎం పదవి ఇస్తారా?

- Advertisement -

అడగందే అమ్మైనా అన్నం పెట్టదు..ఇక రాజకీయాల్లో ఆ ప్రస్తావనే ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అడిగినా పదవి వచ్చే దాక కష్టమే. చివరి నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇదే పవన్‌ని కరెక్ట్‌గా సెట్ అవుతుంది.

టీడీపీతో పొత్తు అనంతరం వచ్చేది సంకీర్ణ సర్కారేనని చెప్పకనే చెబుతున్నారు.అయితే అంతవరకు బాగానే ఉన్నా తానే ముఖ్యమంత్రినని పరోక్షంగా సంకేతాలిస్తున్నారు. అయితే టీడీపీ చరిత్రను పరిశీలిస్తే సంకీర్ణ సర్కార్ వచ్చినా అధికారం ఇతరులకు ఇచ్చింది లేదు. టీడీపీ ఒంటరిగా పోటీచేసింది లేదు.

ఇక ఒకవేళ అవసరమైతే పవన్‌ని సైతం ఓడించేందుకు వెనుకాడరు టీడీపీ నేతలు. రాజకీయాల్లో ఇది కామనే. సొంత పార్టీలోనే నేతలు తమ ఎదుగుదలకు అడ్డంగా వస్తున్నారంటే వారిని పక్కకు తప్పిస్తారు. ఇలా ఆ పార్టీ..ఈ పార్టీ అని కాదు..అన్ని పార్టీలది అదే తంతు. ఇక పవన్‌ విషయంలో ఇదే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఓ దశలో పవన్ కీలకంగా మారతారని తెలిస్తే ఆయన్ని అంతే స్మూత్‌గా తప్పించడంలో సిద్దహస్తులు టీడీపీ నేతలు.అందుకే పవన్ జనసేనను చంద్రసేనగా మార్చినా అది..టీడీపీకి ఉపయోగపడుతుంది తప్ప పవన్‌కు ఏ మాత్రం ఉపయోగం ఉండదు. ఏదైనా అర్ధం కావడానికి కాలం కలిసిరావల్సిందే. అందుకే ఏపీ ఎన్నికల తర్వాత టీడీపీ – జనసేన బంధం ఎంతకాలం కలిసి ఉంటుందో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -