Sunday, April 28, 2024
- Advertisement -

కూకట్‌పల్లి నుండి బండ్ల..క్లారిటీ ఇచ్చేశాడు!

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది కాంగ్రెస్ దూకుడు పెంచుతోంది. బీఆర్ఎస్, బీజేపీ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్‌లోకి వలసలు రానుండగా మరోవైపు సినీ గ్లామర్‌ను వాడుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటినే హీరో నితిన్ ప్రచారం చేస్తారని వార్తలు తాజాగా బండ్ల గణేష్ పేరు వినిపిస్తోంది.

కూకట్‌పల్లి నుండి బంగ్ల గణేష్ బరిలోకి దిగనున్నారని వార్తలు రాగా దీనిపై ఆయన స్పందించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చెయ్యను… రేవంత్ రెడ్డి నాకు ఇప్పుడు అవకాశం ఇస్తానని చెప్పారు. కానీ, నాకు ఈసారి టికెట్ వద్దు అని పుకార్లకు చెక్ పెట్టారు గణేష్. కాంగ్రెస్ పార్టీకి అధికారం రావడం ముఖ్యం. దానికోసం పనిచేస్తాను. రేవంతన్న మీ ప్రేమకు కృతజ్ఞుణ్ణి… టికెట్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటమే నా ధ్యేయం. తప్పకుండా అధికారంలోకి వస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తాం జై కాంగ్రెస్ అని పేర్కొన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి సముచిత ప్రాధాన్యత కల్పించాలని కమ్మ రాజకీయ ఐక్య వేదిక నాయకులు ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కవగా ఉండే కూకట్ పల్లి నుండి బండ్ల పేరు ప్రస్తావనకు రాగా దానిని ఆదిలోనే ఖండించారు. దీంతో రూమర్స్‌కి చెక్ పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -