Saturday, May 4, 2024
- Advertisement -

నేనే సీఎం..పవన్ బయటపెట్టేశాడు!

- Advertisement -

ఏపీకి సీఎం కావాలి ఇది జనసేనాని పవన్ కళ్యాణ్ కోరిక. ఇదే విషయాన్ని జనసేన కార్యకర్తలతో అనేక సార్లు వెల్లడించారు. తాను సీఎం అయితే ఏపీ అభివృద్ధి చెందుతుందని, ప్రజా సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంటుందని చెబుతుండే వారు. అయితే ఇదంతా టీడీపీతో పొత్తుకు ముందు.

ఇక టీడీపీతో పొత్తు ప్రకటించిన తర్వాత పవన్ ఎప్పుడూ ఎక్కడా సీఎం పదవి అనే మాట ఎత్తలేదు. కానీ విజయవాడలో జరిగిన జనసేన కార్యకర్తల మీటింగ్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించి హీట్ పెంచేశారు. తాను ఏపీకి సీఎం అవుతానని…ఆ పదవి చేపట్టడానికి సుముఖంగా ఉన్నానని చెప్పారు. ఇక పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారగా టీడీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది.

ఎందుకంటే టీడీపీకి ఇప్పుడు పవన్‌ మద్దతు కంపల్సరీ. అందుకే పవన్ ఏం మాట్లాడినా స్పందించడం లేదు. ఇక పొత్తులో భాగంగా 50కి పైగా స్ధానాలను అడుగుతున్నారు పవన్. ఇందులో 20 గెలిస్తే చాలు సీఎం సీటు వస్తుందనే ఆశతో ఉన్నారు పవన్.

గతంలో పవన్ సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యంతో వచ్చి ఎన్నికల్లో ఘోరంగా విఫలమయ్యారు.తర్వాత కేంద్ర మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీతో రాజీ పడ్డారు. తర్వాత రాజకీయాలకు నో చెప్పారు. ఆ తర్వాత పవన్ ప్రయత్నించి ఒకే ఒక్క సీటు తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు సీఎం సీటు టార్గెట్‌గా పెట్టుకున్న పవన్‌ ఆశలు నెరవేరుతాయో లేదో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -