Friday, May 3, 2024
- Advertisement -

ఎన్నికల వేళ రేవంత్‌కు షాక్..!

- Advertisement -

బీఆర్ఎస్ అసంతృప్త నేతలకు అడ్డాగా మారింది కాంగ్రెస్. ఇక అలాగే కాంగ్రెస్ అసంతృప్తులను అక్కున చేర్చుకుంటోంది బీఆర్ఎస్. ఇక నిన్నటి వరకు సీఎం కేసీఆర్‌ అంటే కారాలు,మిరియాలు నూరిన నేతలంతా ఇప్పుడు ఆయన నాయకత్వానికే జై కొడుతున్నారు.

నిన్న భువనగిరికి చెందిన కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరగా తాజాగా నల్గొండ జిల్లాలో డాక్టర్‌గా మంచిపేరున్న చెరుకు సుధాకర్ సైతం బీఆర్ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకర్. కాంగ్రెస్ నుండి పోటీచేసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే ఫలితం లేకపోవడంతో అసంతృప్తితో ఉన్న సుధాకర్ త్వరలో కారెక్కనున్నారు.

వాస్తవానికి చెరుకు సుధాకర్ చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు కోమటిరెడ్డి. అప్పట్లోనే బహిరంగంగానే సుధాకర్‌పై విమర్శలు చేశారు. ఈ విషయంలో రేవంత్‌ను వదిలిపెట్టలేదు. ఇక పార్టీకి రాజీనామా లేఖను పంపించిన సుధాకర్…కోమటిరెడ్డి పేరును ప్రస్తావించారు. ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనమని పేర్కొన్నారు. జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విపరీత ధోరణిత వ్యవహరిస్తున్నారని ..ఆయన్ని నిలువరించడంలో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. చెరుకు సుధాకర్‌తో ఇప్పటికే కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డిలు చర్చలు జరిపారని ఇవాళో, రేపో ఆయన బీఆర్ఎస్‌లో చేరడం ఖాయమని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -