అనకాపల్లిలో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకుంది. కంపెనీ విస్తరణలో భాగంగా ప్రహరీ గోడ నిర్మిస్తుంది ఎన్ఏఓబి కంపెనీ. గోడ నిర్మిస్తే తమకు సముద్రంలో వేటకు వెళ్ళడానికి అవకాశం లేదని పెదకవలాపల్లి గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. అచ్యుతాపురం సెజ్ కి వెళ్ళే బస్సులను అడ్డుకుని నిరసన తెలిపారు గ్రామస్థులు . సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసన కారులను శాంతింపచేసే ప్రయత్నం చేయగా పోలీసులు.. గ్రామస్థులకు వాగ్వాదం చోటు చేసుకుంది.
అచ్చుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను వైసీపీ అధినేత జగన్ పరామర్శించిన సంగతి తెలిసిందే. బాధితులకు అందుతున్న వైద్యం, వాళ్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో ప్రభుత్వం తీరు సరికాదు అని బాధితులకు తక్షణమే సాయం అందించాలని డిమాండ్ చేశారు.
అంతేగాదు మూడు వారాలు ప్రభుత్వానికి సమయం ఇచ్చిన జగన్…ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేదంటే బాధితుల పక్షాన వచ్చి తానే స్వయంగా ధర్నాలో పాల్గొంటానని చెప్పారు జగన్.
