ఈ ఆగస్టు 23 ని టార్గెట్ చేసి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘వెడ్డింగ్ డైరీస్’ సినిమాని మంచి బజ్ ను క్రియేట్ చేసింది. బిగ్ బాస్ అర్జున్ అంబటి, చాందినీ తమిళరసన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకట్ రమణ మిద్దె దర్శకత్వం వహించారు. ఎం.వి.ఆర్ స్టూడియోస్ సంస్థ పై వెంకట్ రమణ మిద్దె ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులని ఎలా ఆకట్టుకుందో తెలుసుకుందాం రండి :
కథ : ప్రశాంత్(అర్జున్ అంబటి) ,శృతి(చాందినీ తమిళరసన్) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు.వీరు తమ పిల్లలు నిఖిల్, నిహారిక..లతో సంతోషంగా జీవిస్తుంటారు .అయితే ఊహించని విధంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడతాయి. ఫ్యామిలీ లైఫ్ ని ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలన్స్ చేయలేక ఇద్దరూ గొడవలు పడుతుంటారు.ఫైనల్ గా వీరి గొడవలు విడాకులు తీసుకునే స్థాయికి వెళ్తాయి. ఆ తర్వాత వీరి జీవితాలు ఎలాంటి టర్న్ తీసుకున్నాయి అనేది తెరపై చూడాల్సిందే.
నటీనటుల పెర్ఫార్మన్స్ : అర్జున్ అంబటి ప్రశాంత్ పాత్రలో చాలా సహజంగా నటించాడు. ‘రాజా రాణి’ లో ఆర్యని తెలుగు ప్రేక్షకులు ఎంతబాగా ఓన్ చేసుకున్నారో..ఈ సినిమా చూస్తే అర్జున్ అంబటిని కూడా అంత బాగా ఓన్ చేసుకుంటారు అనడంలో సందేహం లేదు. హీరోయిన్ చాందినీ తమిళరసన్ పాత్ర చాలా టిపికల్ గా ఉంటుంది. కానీ ఆమె నటనతో ఈ పాత్రకి ఆమె జీవం పోసింది.గ్లామర్ పరంగా కూడా మెప్పించింది చాందినీ. రవి శివ తేజ, చమ్మక్ చంద్ర స్టార్టింగ్లో నవ్వించారు. సీనియర్ నటి జయలలిత కూడా హీరోకి అత్త పాత్రలో చక్కగా నటించింది. సత్య శ్రీ, శ్రీవాణి త్రిపురనేని వంటి మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.
సాంకేతిక నిపుణుల పనితీరు : ‘వెడ్డింగ్ డైరీస్’ కథ పరంగా కొత్తగా అనిపించకపోవచ్చు. ప్రేమించి, పెళ్లి చేసుకోవడం… ఆ తర్వాత హీరో, హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు రావడం అనే పాయింట్ వందల సినిమాల్లో చూసినదే. కానీ స్క్రీన్ ప్లే పరంగా ‘వెడ్డింగ్ డైరీస్’ ఓ కొత్త అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాకి ‘రీసెట్ అండ్ రీ స్టార్ట్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఈ క్యాప్షన్ ను బట్టి స్క్రీన్ ప్లేని దర్శకుడు వెంకట్ రమణ మిద్దె ఎంత కొత్తగా డిజైన్ చేసుకున్నాడు అనేది అర్ధం చేసుకోవచ్చు. పెళ్ళికి ముందు ఉన్న ప్రేమ… పెళ్ళైన కొన్నేళ్ళకే ఎందుకు తగ్గుతుంది? చాలా జంటలు విడాకుల బాట ఎందుకు పడుతున్నాయి.. అనే సెన్సిటివ్ టాక్ ని చాలా సెన్సిబుల్ గా చెప్పాడు దర్శకుడు. కలిసుండటం, గొడవపడటం కంటే విడిపోతే వచ్చే కష్టాలని తెలుపుతూ ఈ చిత్రాన్ని ఆవిష్కరించాడు. ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ కట్టిపడేస్తాయి. క్లైమాక్స్ అయితే యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మదీన్ ఎస్.కె మ్యూజిక్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఓ రకంగా సినిమాకి సోల్ అనుకోవచ్చు.పాటలు బాగున్నాయి. వినడానికే కాదు చూడటానికి కూడా ఆకట్టుకున్నాయి. పాటలే కాదు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ప్లెజెంట్ ఫీలింగ్ కలిస్తుంది. ఈశ్వర్ ఎళ్ళుమహంతి సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాకి రిచ్ నెస్ తీసుకొచ్చింది.
ప్లస్సులు :
డైరెక్షన్
సెకండాఫ్
నటీనటుల పెర్ఫార్మన్స్
సంగీతం
మైనస్సులు :
సడన్ క్లైమాక్స్
ఓవరాల్ గా ‘వెడ్డింగ్ డైరీస్’ ఇప్పటి యూత్ కచ్చితంగా చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ వీకెండ్ కి థియేటర్లో చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా.
రేటింగ్ : 3/5
