Tuesday, June 18, 2024
- Advertisement -

వైసీపీ వస్తేనే మేలు..ప్రజల మనోగతం ఇదేనా?

- Advertisement -

ఏపీ ఎన్నికల పోలింగ్ ముగిసి దాదాపు 15 రోజులు కావొస్తున్న ఇంకా గెలుపు ఎవరిదనే దానిపై చర్చ జరుగుతోంది. ఇక వైసీపీ తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తుందని జగన్ ధీమా వ్యక్తం చేస్తుండగా కూటమి నేతలు సైతం విజయం తమదేనని చెబుతున్నారు.

ఇక ఓటర్లు తమ పార్టీకి జై కొట్టారంటే లేదు మాపార్టీకే జై కొట్టారని పార్టీల నేతలు చెబుతున్నా ఓటరు నాడి మాత్రం అంతుచిక్కడం లేదు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం జగన్‌ వైపే ప్రజలు అనుకూలంగా ఉన్నారు. పోలింగ్ ముగిసి రెండు వారాలు కావొస్తుండగా మళ్లీ జగన్ అధికారంలోకి వస్తేనే తమకు మంచి జరుగుతుందని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు.

జగన్ అధికారంలోకి వస్తేనే సంక్షేమ పథకాలు మన ఇంటివరకు వస్తాయని చెబుతున్నారు. చంద్రబాబు అంటేనే కరువని అలాంటి పరిస్థితిని తాము కోరుకోవట్లేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు జగన్‌కు జై కొట్టారని పలువురు చెబుతుండగా ఓటర్లు ఏ విధమైన తీర్పు ఇచ్చారో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -