- Advertisement -

పీరియడ్స్‌ టైం..ఇవన్నీ తాత్కాలిక మార్పులే!

- Advertisement -

పీరియడ్స్‌కు ముందు కొన్ని రోజులలో స్పష్టంగా ఆలోచించడం కష్టంగా అనిపిస్తుందా? దీనికి హార్మోన్ల మార్పులు కారణమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది మహిళలు పీరియడ్స్‌కు ముందు రోజులలో ఏదో తేడాగా అనిపిస్తుందని చెబుతారు. దృష్టి కేంద్రీకరణ తగ్గడం, చిన్న నిర్ణయాలు తీసుకోవడం కూడా కష్టంగా అనిపించడం, సాధారణ పనులు చేయడానికి ఎక్కువ సమయం పడటం వంటి సమస్యలు కనిపిస్తాయి. చాలాసార్లు దీన్ని ఒత్తిడి లేదా బిజీ షెడ్యూల్ కారణంగా భావిస్తారు. కానీ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు కూడా దీనికి ప్రధాన కారణమవుతాయి.

ల్యూటియల్ దశ మెన్స్ట్రువల్ సైకిల్‌లో చివరి దశ. ఇది సాధారణంగా అండోత్సర్గం తర్వాత ప్రారంభమై పీరియడ్స్ ప్రారంభమయ్యే వరకు సుమారు 14 రోజులు ఉంటుంది. ఈ సమయంలో శరీరం గర్భధారణకు సిద్ధమవుతుంది. ఈ దశలో మహిళలకు కడుపు ఉబ్బరం, మొటిమలు, వక్షోజాల్లో నొప్పి, మూడ్ మార్పులు వంటి లక్షణాలు కనిపించవచ్చు.

ఈ సమయంలో ప్రొజెస్టెరోన్ హార్మోన్ స్థాయి పెరుగుతుండగా, ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గుతుంది. దీనివల్ల మెదడులోని డోపమైన్ అనే న్యూరోట్రాన్స్‌మిటర్ స్థాయి కూడా తగ్గే అవకాశం ఉంది. డోపమైన్ మనలో ఉత్సాహం, దృష్టి కేంద్రీకరణ, భావోద్వేగాలను నియంత్రించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

ఈ కారణంగా బ్రెయిన్ ఫాగ్, భావోద్వేగ సున్నితత్వం పెరగడం, ఏకాగ్రత తగ్గడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం వంటి సమస్యలు తలెత్తవచ్చు. అందుకే పీరియడ్స్‌కు ముందు రోజులలో పెద్ద నిర్ణయాలు తీసుకోవడాన్ని వీలైతే వాయిదా వేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అయితే ఇవన్నీ తాత్కాలిక మార్పులే. పీరియడ్స్ ప్రారంభమైన తర్వాత హార్మోన్ల స్థాయి మళ్లీ సంతులనం చెందడంతో మానసిక స్పష్టత సాధారణ స్థితికి వస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -