- Advertisement -

ఎన్డీయే కూటమిలోకి విజయ్..డిప్యూటీ సీఎం ఆఫర్!

- Advertisement -

తమిళనాడులో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడుతున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ, తమిళగ వెట్రీ కజగం(TVK) మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

సమాచారం ప్రకారం రాబోయే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని ఈ రెండు పార్టీలు ప్రాథమికంగా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. టీవీకే పార్టీకి నాయకత్వం వహిస్తున్న నటుడు విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

పొత్తులో భాగంగా టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ స్థానాలు కేటాయించే అంశంపై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఈ సీట్ల పంపకం ద్వారా తమిళనాడులో బలమైన ప్రత్యామ్నాయ కూటమిని నిర్మించాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహం రూపొందిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తమిళనాడులో మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రధానంగా డీఎంకే, ఏఐడీఎంకే మధ్య పోటీ కొనసాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ–టీవీకే పొత్తు ఏర్పడితే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులకు దారితీయవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -