Monday, June 17, 2024
- Advertisement -

అంతా ఊహాగానాలే..ఒప్పుకున్న పీకే!

- Advertisement -

ఏపీలో ఈసారి జరిగే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని, ఆ పార్టీకి 50 సీట్లు కూడా రావని పలు ఇంటర్వ్యూల్లో చెప్పి వైసీపీ నేతల ఆగ్రహానికి గురయ్యారు ఎన్నికల ఎనలిస్ట్ ప్రశాంత్ కిశోర్. అయితే ఆయన చెప్పెవన్నీ అబద్దాలేనని వైసీపీ నేతలు ఖండించారు కూడా.

అయితే తాజాగా పలు ఇంటర్వ్యూల్లో వైసీపీపై విషం చిమ్మేందుకు ప్రయత్నించారు పీకే.కానీ ఈ సందర్భంగా అడ్డంగా బుక్కయ్యారు. పీకేకు ముచ్చెమటలు పట్టించారు జర్నలిస్టు శ్రీనివాసన్ జైన్.

చంద్రబాబుకు మీరు పని చేశారా? అని ప్రశ్నించగా లేదు కలిశాను, నా మీద ఆయనకు కొన్ని అనుమానాలు ఉంటే సమాధానం చెప్పడానికి వెళ్ళాను అని చెప్పారు.ఇక తాను ఏపీకి వెళ్లి కొంతమంది ఇంటర్వ్యూని చేశా, టిడిపి నేత మాగుంట శ్రీనివాస రెడ్డి డైరెక్ట్ గా నాతో చెప్పారు ప్రశాంత్ కిషోర్, చంద్రబాబు ఇద్దరూ నన్ను టిడిపిలోకి రమ్మని ఆహ్వానించారు అందుకే వచ్చాను అని చెప్పారు అని జైన్ అనగా లేదు నేను ఫ్రెండ్లీగా మాత్రమే మాగుంటకు సలహా ఇచ్చాను అని చెప్పి అడ్డంగా బుక్కయ్యారు.

మీరు సర్వే చేశారా ఏ పార్టీకి ఎన్ని వస్తాయని ఎలా చెప్తున్నారు? అని పీకేని అడగ్గా నేను ఎలాంటి సర్వేలు చేయలేదు.. నా ఊహాగానాలు మాత్రమే చెప్తున్నాను.అని చెప్పారు. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో మీ అంచనాలు తారుమారయ్యాయి..ఇప్పుడు ఏపీలో కూడా ఇదే జరగబోతుందని చెబుతున్నారు పలువురు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -