Monday, May 5, 2025
- Advertisement -

షేక్ హసినా పతనాన్ని ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్..!

- Advertisement -

బంగ్లాదేశ్‌ ప్రధానిగా షేక్ హసినా వైదొలిగిన సంగతి తెలిసిందే. 15 ఏళ్లుగా బంగ్లాదేశ్‌ను ఏకఛత్రాధిపత్యంగా పాలించిన హసినా పీఠం కదిలింది. రిజ్వరేషన్ల రూపంలో ఆ దేశ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు విద్యార్థుల ఆగ్రహవేశాలకు గురికాగా ఈ ఆందోళనల్లో 300 మందికి పైగా మృతి చెందారు. ప్రస్తుతం బంగ్లాలో సైనిక పాలన నడుస్తుండగా హసినాకు పొంచి ఉన్న ముప్పును ముందే గ్రహించారు ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని.

గతేడాది డిసెంబర్‌లోనే హసినాకు పొంచి ఉన్న ముప్పు పట్ల అలర్ట్ చేశారు. తాను చెప్పిందే నిజమైందని ఎక్స్ ద్వారా వెల్లడించారు. షేక్‌ హసీనా 2024, ఆగస్టులో కష్టాల్లో పడతారని ముందే ఊహించాను అని చెప్పారు.

హసీనాను గద్దె దించాలని అమెరికా, మిత్రదేశాలు భావిస్తున్నాయి… భవిష్యత్తులో ఆమె ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ప్రయత్నాలు జరగబోతున్నాయి. రాబోయే నెలల్లో ముఖ్యంగా మే జూన్, జూలై 2024లో ఆమె జాగ్రత్తగా ఉండాలంటూ అక్టోబర్ 31న ప్రశాంత్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -