Sunday, April 28, 2024
- Advertisement -

విరాట్ కోహ్లీ ఫెక్ ఫీల్డింగ్.. ఐసీసీ ఎందుకు స్పందించలేదు !

- Advertisement -

టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న భారత్, బంగ్లాదేశ్ మద్య జరిగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. నరాలు తెగే ఉత్కంఠలో 5 పరుగుల తేడాతో భారత్ బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో చోటు చేసుకున్నా కొన్ని ఆసక్తికర సంఘటనలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా వారునుడి కారణంగా గెలిచే మ్యాచ్ ఓడిపోవడంతో బంగ్లాదేశ్ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది.

దాంతో టీమిండియా పై అక్కసు వెళ్లగక్కుతున్నారు బంగ్లాదేశ్ ఆటగాళ్లు మరియు అభిమానులు. భారత్ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఒకానొక దశలో బంగ్లా సునాయసంగా చేధించేటట్లుగా కనిపించింది. 7వ ఓవర్లో మ్యాచ్ వర్గం కారణంగా నిలిచిపోగా.. డక్ వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ను కొనసాగించారు. అయితే ఆ ఆతరువాత భారత బౌలర్లు విజృంబించడంతో బంగ్లా బ్యాట్స్ మెన్స్ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో తీవ్ర ఒత్తిడిలో బంగ్లాదేశ్ చేతులెత్తిసి మ్యాచ్ ను భారత్ అప్పగించింది.

అయితే 7ఓవర్లో విరాట్ కోహ్లీ ఫెక్ ఫీల్డింగ్ చేశాడని, ఎవరు గమనించకపోవడంతో 5 పరుగులు కోల్పోయామని మా ఓటమికి అది కూడా ఒక కారణం అని బంగ్లాదేశ్ వికెట్ కీపర్ నురుల్ హాసన్ చెప్పుకొచ్చాడు. ఇక బంగ్లా ఫ్యాన్స్ కూడా ఇండియా ఫెక్ ఫీల్డింగ్ చేసిందని ట్విట్టర్ లో ” ఫెక్ ఫీల్డింగ్ ” హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకీ ఫెక్ ఫీల్డింగ్ అనగా ఐసీసీ రూల్ 41.5 ప్రకారం ఊదేశ్యపూర్వకంగా బ్యాటర్ దృష్టిని ఫీల్డర్ మల్లిస్తే అది ఫెక్ ఫీల్డింగ్ కిందకి వస్తుంది. దానికి పెనాల్టీగా 5 ఎక్స్ట్రా పరుగులను ఆ బ్యాటర్ కు యాడ్ చేస్తారు. అయితే అయితే కోహ్లీ ఫెక్ ఫీల్డింగ్ చేసే క్రమంలో బంగ్లా బ్యాట్స్ మెన్ అతని వైపు చూడలేదు. దాంతో అది ఫెక్ ఫీల్డింగ్ కాదని ఇండియన్ క్రికెట్ అభిమానులు వాదిస్తున్నారు. మరి దీనిపై ఐసీసీ స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -