Friday, April 19, 2024
- Advertisement -

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో భారీ పేలుడు… ఏడుగురు మృతి

- Advertisement -

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఆదివారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. మోగ్‌బజార్ వైర్‌లెస్ గేట్ ఏరియా ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో ఘటన జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 70 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 29 మందిని ఢాకా మెడికలల్ కాలేజికి, 10 మందిని నేషనల్ బర్న్ అండ్ ప్లాస్టిక్ ఇన్‌స్టిట్యూట్‌కు తరలించారు. మిగతా వారిని ఇతర ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలియగానే ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ కమిషనర్ షపీఖుల్ ఇస్లామ్ ఘటనా స్థాలానికి వెళ్లి పరిశీలించారు.

అయితే, బాంబు పేలుడు లేదా ఉగ్రదాడి జరిగినట్లుగా అక్కడ ఎలాంటి ఆనవాళ్లు లేవని ఆయన తెలిపారు. గ్యాస్ లీకేజీ లేదా సిలిండర్ పేలుడు వల్లే ఘటన జరిగి ఉండచ్చవని వెల్లడించారు. కాగా, గ్యాస్ పైపులైన్ లో మీథేన్ వాయువు పేరుకుపోయి పేలుడు సంభవించిందని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసు జాయింట్ కమిషనర్ సయ్యద్ నూరుల్ ఇస్లాం వివరించారు.

పేలుడు సంభవించిన భవనంలో రెస్టారెంట్, ఎలక్ట్రానిక్స్ షాపులున్నాయి. దీని పక్కనే ఉన్న మరో రెండు భవనాలు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయని, గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను షేక్ హసీనా బర్న్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

విషాదం : నీట మునిగి 8మంది మృతి.. మరికొంత మంది గల్లంతు!

కాంగ్రెస్ పీసీసీ చిచ్చు : తన పదవికి మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా

నేటి పంచాంగం,సోమవారం(28-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -