బీట్ రూట్ ఆరోగ్యానికి ఎంత మంచిదో…చుండ్రు, తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చడంలో సాయపడుతుంది. బీట్ రూట్ లో బెటాలైన్స్ అనే పిగ్మెంట్ ఉంటుంది. దీనికి యాంటీ ఇన్ ఫ్లమేషన్ గుణాలు ఉన్నాయి. బీట్ రూట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సాయపడుతుంది. క్యాన్సర్ పై పోరాడే బెటైన్, ఫెరూలిక్ యాసిడ్, రూటిన్, కెంఫెరాల్, కెఫీయిక్ యాసిడ్ ఇందులో ఉన్నాయి. కేన్సర్ కణాల విస్తరణను అడ్డుకోవడంలో బీట్ రూట్ సాయపడుతుంది.
అలాగే బీట్ రూట్‌ని షాంపులాగా వాడితే చుండ్రు తగ్గడమే కాదు జట్టు నల్లగా మారుతుంది. 2 లేదా మూడు బీట్ రూట్‌లను తీసుకుని గ్రైండ్ చేసి కాఫీ పౌడర్ కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇలా గంటపాటు ఉంచి గోరువెచ్చని నీటితో కడుక్కుంటే జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సాయం చేస్తుంది.
తలపై దురద నుంచి రిలీఫ్ అవ్వడానికి బీట్‌రూట్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. బీట్ రూట్‌ని రెండు భాగాలుగా కట్ చేసి నేరుగా తలపై రుద్దండి. దీని రసం మీ స్కాల్ప్‌లోకి చొచ్చుకుపోయి మృత చర్మకణాలను తొలగిస్తుంది. ఫలితంగా చుండ్రు నుండి రిలీఫ్ పొందవచ్చు. వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
అయితే ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్న డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమం.