Saturday, May 4, 2024
- Advertisement -

జుట్టు రాలిపోతుందా..బట్టతల భయం పట్టుకుందా అయితే?

- Advertisement -

జుట్టు రాలిపోవడం..ప్రస్తుత కాలంలో ఆడ,మగ అనే తేడా లేకుండా అందరిని వేధిస్తున్న సమస్య ఇది. రకరకాల షాంపోలు వాడటం,సరైన ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి ఇలా సమస్య ఏదైనా ప్రభావం మాత్రం ఆరోగ్యంపైనే కాకుండా వివిధ రకాల సమస్యలకు కారణం అవుతోంది. ఇందులో భాగంగా జుట్టు రాలిపోవడం అనేది పెను సమస్యగా మారి మానసికంగా కుంగిపోయే పరిస్థితి వస్తోంది.

20 ఏళ్ళు కూడా నిండని వారు బట్టతలతో బాధపడుతూ మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. అయితే కొందరిలో ఈ జుట్టు రాలే సమస్య వంశపారపర్యంగా వస్తే మరికొంతమందిలో మాత్రం వారు తీసుకునే ఆహారపు అలవాట్లు కూడా కారణం అవుతోంది.

ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మానసిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. యోగా, ధ్యానం వంటివి చేయడంతో పాటు తినే ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోవడం వల్ల జుట్టురాలే సమస్యను అధిగమించవచ్చు. ప్రధానంగా విటమిన్ సి, ఐరన్ లోపిస్తే జుట్టు రాలుతుంది కాబట్టి..మనం తినే ఆహారంలో ఇవి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఇవి సమృద్ధిగా ఉంటాయి కాబట్టి డైలీ డైట్‌లో ఇవి ఉండేలా చూసుకోవాలి.

మంచి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో జంక్ ఫుడ్ ను అవాయిడ్ చేయడం అంతే ఇంపార్టెంట్. ఇక మనం జుట్టుకు రాసే నూనెల్లో కొబ్బరి, బాదం, ఆలివ్ ఆయిల్‌ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -