Monday, April 29, 2024
- Advertisement -

అబ్బాయిల్లో హెయిర్ ఫాల్ హోం రెమిడీస్..

- Advertisement -

అమ్మాయిలు అంటే.. అందం, జుట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అంటారు. అలాగే మగవాళ్ల కూడా జుట్టుకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. జుట్టు రాలిపోతోంది అంటే చాలు.. మగవాళ్ల చాలా టెన్షన్ పడుతుంటారు. బట్టతల వచ్చేస్తుందన్న ఆందోళన ఎక్కువగా ఉంటుంది.

సరైన పోషకాహారం, వయసు వంటి కారణాల వల్ల అబ్బాయిల్లో హెయిర్ ఫాల్ ఎక్కవగా అవుతుంటుంది. కాబట్టి జుట్టు రాలుతున్న సంకేతాలు గుర్తించిన వెంటనే.. ఈ ఎఫెక్టివ్ హోం రెమిడీస్ ని ఒక్కసారి ఫాలో అవడం వల్ల.. చిన్న వయసులోనే హెయిర్ సమస్యను నివారించవచ్చు.

*అత్యంత ముఖ్యమైన టిప్.. వారానికి రెండుసార్లు జుట్టుకి ఆయిల్ పెట్టడం. దీనివల్ల జుట్టు హెల్తీగా ఉంటుంది. అంతేకాదు ఆలివ్ ఆయిల్ ఉపయోగించడం వల్ల.. జుట్టుని రక్షణ కల్పించడంతో పాటు, పోషణ అందిస్తుంది.

*రెండు టీస్పూన్ల తేనె, ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని తలకు పట్టించి 20 నిమిషాలు ఆరిన తర్వాత.. మైల్డ్ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి వేస్తే అబ్బాయిల్లో జుట్టు రాలడం నివారించవచ్చు.

*250 గ్రాముల ఆవనూనెలో గోరింట ఆకులు కలిపి బాగా ఉడికించాలి. చల్లారిన తర్వాత ఆయిల్ వడకట్టి.. జుట్టుకి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత.. జుట్టుని శుభ్రం చేసుకోవాలి.

*హాట్ వాటర్ లో జామ ఆకులు వేసి.. కొన్ని నిమిషాల పాటు మరిగించాలి. నీళ్లు నల్లగా మారేవరకు మరిగించాలి. కాటన్ ఉపయోగించి.. దాన్ని స్కాల్ఫ్ కి పట్టించాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తూ ఉంటే.. జుట్టు రాలడాన్ని నివారించవచ్చు.

*జుట్టు రాలడాన్ని తగ్గించడంలో ఉసిరికాయ వండర్స్ చేస్తుంది. బట్టతల నివారించడంలో కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నిమ్మరసంను, ఉసిరి జ్యూస్ లో కలిపి.. స్కాల్ప్ కి పట్టించాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.

*అబ్బాయిల్లో జుట్టు రాలడం తగ్గించే ఎఫెక్టివ్ రెమెడీ.. తేనె, పచ్చసొన. రెండింటినీ.. సమానంగా తీసుకుని కలిపి.. స్కాల్ప్ కి 30 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. పచ్చసొన జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -