Sunday, May 4, 2025
- Advertisement -

వెల్లుల్లితో గుండెపోటుకు చెక్..అల్లంతో ఎన్ని ప్రయోజనాలో!

- Advertisement -

అల్లం, వెల్లుల్లి మన నిత్యజీవితంలో భాగమైపోయాయి. ఏ కర్రీ వండినా ఈ రెండు కావాల్సిందే. అయితే ఈ రెండింటితో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.మంచి ఆరోగ్యానికి అల్లం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం రుచికే కాదు జీర్ణక్రియను మెరుగు పర్చడానికి సహాయపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. ఉబ్బరం, గ్యాస్ సమస్యకు అల్లంతో చెక్ పెట్టవచ్చు. అలాగే మలబద్దకం సమస్యకు అల్లం చక్కటి పరిష్కారం.

అధిక కొలెస్ట్రాల్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌ను నియంత్రించి గుండెపోటును దరిచేరనీయకుండా సాయపడుతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో వెల్లుల్లిది కీలకపాత్ర.

శరీరంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించడానికి, ముందుగా ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. మీరు తినే ఆహారంలో పచ్చి వెల్లుల్లిని చేర్చితే.. చెడు కొలెస్ట్రాల్‌ని సులభంగా తగ్గించి ట్రైగ్లిజరైడ్‌లను పెంచుతుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రించడంలో వెల్లుల్లి ప్రభావవంతంగా పనిచేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ ఉన్న వారు ప్రతీ రోజు ఉదయమే వెల్లుల్లి తినడం చాలా ప్రయోజనకరం.

పచ్చి వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అలాగే వెల్లుల్లి రక్తాన్ని పలుచగా చేస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది తద్వారా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. వెల్లుల్లి రుచి కొద్దిగా చేదుగా ఉంటుంది కాబట్టి పచ్చి వెల్లుల్లిని తినడానికి ఇబ్బంది పడే వారు తేనెతో కలిపి తినవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -