Monday, May 6, 2024
- Advertisement -

పొడిదగ్గును ఇలా కూడా తగ్గించుకోవచ్చు….

- Advertisement -

వింటర్లో అందరిని బాధ పెట్టే సమస్య…. పొడి దగ్గు. తీసుకునే శ్వాసకు ఇబ్బంది కలిగితే దగ్గు వస్తూ ఉంటుంది. వయసుతో సంభంధం లేకుండా పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గుతో సతమతమవుతూనే ఉంటారు. వాతావరణం మార్పులవలన మనం పిలిచే గాలిలో ఘాటైన వాసనలు దుమ్ము ధూళి కారణంగా మన శరీరంలో ఇన్ఫెక్షన్లు మొదలై మరియు చల్లని పానీయాలు తాగడం వలన దగ్గు వస్తూ ఉంటుంది. ఇలాంటి దగ్గులని ఇంట్లో ఉండే దినుసులతో ఎలా కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం.

మొదటి చిట్కా: కావల్సిన పదార్దాలు పసుపు, తేనె. పసుపులో ఉండే కార్టూమాన్స్ అనే యాంటి ఓక్సన్స్ దగ్గుని తగ్గించడంలో ఎంతో సహాయపడుతుంది. పసుపులో యాంటి బ్యాక్తిరియా యాంటీ వైరల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. పసుపులో ఉన్న యాంటీ ఇంఫ్లోమెటరీ లక్షణాలు చెస్ట్ లో ఉన్న కంజక్షన్ని తగ్గించడంలో ఎంతగానో సహాయ పడుతుంటాయి. అందుకే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా తేనె ఈ రెండు బాగా కలిపి ఓ మిశ్రమాన్ని తీసుకోండి. ఇది దగ్గు నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

చిట్కా నెంబర్ 2: కావల్సిన పదార్దాలు… తేనె ,సొంటి పౌడర్. సొంటి పౌడర్ తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోండి. పొడి దగ్గు నుంచి మీకు ఉపశమనం కలుగుతుంది.

చిట్కా నెంబర్ 3: కావాల్సిన పదార్థాలు.. మిరియాల పొడి, గోరువెచ్చని పాలు. గోరువెచ్చని పాలల్లో కొద్దిగా మిరియాల పొడిని వేసుకోండి. గోరువెచ్చని పాలల్లో మిరియాల పొడి వేసుకొని కలుపుకుని తాగడం వలన దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.

చిట్కా నెంబర్ 4: కావల్సిన పదార్దాలు… కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు. వీటితో అల్లం టీ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పెట్టుకొని ఒక బౌల్ తీసుకుని దానిలో వాటర్ పోసుకుందాం. కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను నీళ్లలో బాగా మరిగించండి. నీళ్లు ఇంకా బాగా బాయిల్ అయ్యాక …సగం వరకు నీటిమట్టం తగ్గేలా చూద్దాం. ఇలా ఎందుకంటే అల్లం బాగా మసిలిపోయింది. అల్లంలో ఉన్నటువంటి ఔషధ గుణాలు అన్ని కూడా నీళ్లలో కలిసిపోయాయి. కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకుని దీన్ని మనం ఒక గ్లాసులోకి తీసుకుందాం. రోజు పొడి దగ్గుతో బాధపడేవారు ఈ అల్లం టీ ని రెండు నుంచి మూడు సార్లు తీసుకోడం వలన పొడి దగ్గుని తగ్గించుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -