Saturday, May 4, 2024
- Advertisement -

చెడు కొలెస్ట్రాల్..వేధిస్తుందా?

- Advertisement -

చెడు కొలెస్ట్రాల్…ఇప్పుడు అందరిని వేధిస్తున్న సమస్య ఇదే. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు బయటపడితే తప్ప గుర్తించడం కష్టం. ఆహారపు అలావట్లు, మారుతున్న జీవన విధానంతో అనారోగ్య సమస్యలు చుట్టుముడుతన్నాయి. ప్రధానంగా చెడు కొలెస్ట్రాల్‌తో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో పాటు ఆయాసం, ఉబుసం, ఊపిరితిత్తుల సమస్యలు. మలబద్దకం ఇలా అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అయితే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ని సహజసిద్ధంగా తగ్గించుకోవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం, రన్నింగ్, స్విమ్మింగ్ వంటివి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆపిల్ పండులో కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. బ్లాక్ బెర్రి పండ్లు కూడా కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

బీన్స్, పుట్టగొడుగులు, వెల్లుల్లి వంటివి కూడా మనశరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. యాలకులతో తిన్న ఆహారం సాఫీగా జీర్ణమై శరీరానికి తగినంత జీవశక్తిని ఇస్తుంది. వెల్లుల్లిలోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్‌లోని యాంటీ ఆక్సిడెంట్స్ హృద్రోగులకు ఎంతో మేలు చేస్తాయి. రాగి, జొన్న, గోధుమలను ఎక్కువగా వాడితే తక్కువ కొలెస్ట్రాల్‌తోపాటు ఎక్కువ ఫైబర్ లభిస్తుంది. ఇవన్నీ మీ డైలీ మెనూలో ఉండేలా చూసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -