Friday, May 9, 2025
- Advertisement -

కీలక పరిణామం..వైసీపీలోకి రాయపాటి?

- Advertisement -

ఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్ జపాంగ్‌లతో పార్టీలు మారుతున్నారు నేతలు. ఇక ప్రధానంగా టీడీపీని వీడి పెద్ద ఎత్తున వైసీపీలో చేరేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే విజయవాడం ఎంపీ కేశినేని వైసీపీలో చేరగా ఆయనకు విజయవాడ టికెట్ కన్ఫామ్ చేశారు సీఎం జగన్.

టీడీపీ అసమ్మతులతో పాటు కాపు సామాజికవర్గం నేతలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు జగన్. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత రాయపాటి సాంబశివ రావు కొడుకు రాయపాటి రంగరావు టీడీపీకి రాజీనామా చేయగా ఆయన్ని పార్టీలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పటికే ఆయనతో టచ్‌లోకి వెళ్లగా త్వరలోనే రంగారావు వైసీపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ రంగారావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు ఫోటోను నెలకేసి కొట్టిన రంగారావు..టీడీపీ దిక్కుమాలిన పార్టీ అని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ఒక వ్యాపార సంస్థ అని… తమ కుటుంబాన్ని సర్వనాశనం చేసింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 150 కోట్లు తమ నుంచి తీసుకున్నారని ఆరోపించారు.ఇక రాయపాటి టీడీపీని వీడటం ఆ పార్టీకి గట్టి దెబ్బేనని అంతా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -