మన శరీరంలోని ప్రతి అవయవం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందులో లివర్ (కాలేయం) అత్యంత కీలకమైన అవయవం. ఇది ఆహారాన్ని జీర్ణించడంలో సహాయపడటంతో పాటు రక్తాన్ని శుద్ధి చేస్తుంది. లివర్ బలంగా ఉంటే జీర్ణశక్తి మెరుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడంలో కూడా లివర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నేటి వేగవంతమైన జీవనశైలి, జంక్ ఫుడ్, మద్యం వినియోగం పెరగడం వల్ల లివర్ సమస్యలు అధికమవుతున్నాయి.
తిప్పతీగా : ఆయుర్వేదంలో ఇది అమృతంగా భావిస్తారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచి శరీరంలో వాపును తగ్గిస్తుంది.ఉదయం ఖాళీ కడుపుతో గిలోయ్ జ్యూస్ లేదా కషాయం తాగాలి.
భృంగరాజ్: లివర్ టానిక్‌గా ప్రసిద్ధి. ఫ్యాటీ లివర్ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. పీత (జాండీస్) ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది. ఒక టీస్పూన్ భృంగరాజ్ పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవచ్చు లేదా దాని రసం తాగవచ్చు.
ఆమ్లా (ఉసిరికాయ): విటమిన్ C సమృద్ధిగా ఉండి లివర్‌లోని విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. రోజూ 1–2 ఉసిరికాయలు తినాలి లేదా జ్యూస్/పొడి రూపంలో తీసుకోవచ్చు.
పసుపు: కర్క్యూమిన్ అనే పదార్థం ఉండి లివర్ వాపు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రాత్రి పసుపు పాలు తాగడం లేదా ఆహారంలో చేర్చడం మంచిది.
నిమ్మరసం + తేనె: ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే లివర్ శుభ్రంగా ఉంటుంది.
లివర్ ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే..రోజూ కనీసం 30 నిమిషాలు యోగా లేదా వ్యాయామం చేయాలి.ఆకుకూరలు, తాజా పండ్లు ఆహారంలో చేర్చాలి.రోజుకు 3–4 లీటర్లు నీరు తాగాలి.మద్యం, సిగరెట్ వంటి మత్తు పదార్థాలను వాడకూడదు.ఎక్కువ నూనె, మసాలా ఉన్న ఆహారాన్ని తగ్గించాలి.సరిపడ నిద్ర అవసరం. లివర్ బలపరచడానికి ఏ ఆయుర్వేద ఔషధం వాడే ముందు నిపుణుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.
