- Advertisement -

మూసీ దండి మార్చ్‌లో కేటీఆర్

- Advertisement -

మూసీ ప్రభావిత ప్రాంతాల ప్రజలు నిర్వహించిన “మూసీ దండి మార్చ్”లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని బాధితులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

గత బీఆర్ఎస్ హయంలో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా 5 కిలోమీటర్ల మేర మూసీ సుందరీకరణ చేపట్టామని గుర్తుచేశారు. “ఇళ్లు కూలగొట్టకుండా సుందరీకరణ చేయలేరా?” అని ప్రశ్నించారు. రూ.16 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్ట్‌కు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.

ప్రదర్శనకు వచ్చిన చిన్నారులు తమ కిడ్డీ బ్యాంకులు, టెడ్డి బేర్లు తీసుకుని వచ్చి “మా ఇల్లు వదిలేయండి” అని చెప్పమని అడిగారని కేటీఆర్ భావోద్వేగంగా పేర్కొన్నారు. “వాళ్లకు ఏం సమాధానం చెబుతారు?” అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రెండేళ్లు తమ భూములు, ఇళ్లు కాపాడుకోవాలని, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎవరి ఇంటి మీద సున్నం కూడా పడనివ్వమని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రూ.200 కోట్లతో జూబ్లీహిల్స్‌లో రెండో ఇల్లు, భట్టి విక్రమార్క మధిరలో మూడో ఇల్లు కడుతున్నారని ఆరోపించారు.

“పేదలకు ఒక ఇల్లు ఉంటే కూలగొడతారా? కొడంగల్‌లోని రెడ్డి కుంట FTLలో ఉన్న ఇల్లు కూలగొట్టే ధైర్యం ఉందా?” అంటూ సవాలు విసిరారు. మూసీ బాధితులకు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -