దుబాయ్‌లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) – 2024 అవార్డు వేడుకలు ఘనంగా జరిగాయి. తొలి రోజు తెలుగు, కన్నడ సినీ పరిశ్రమకు సంబంధించిన అవార్డుల వేడుక జరుగగా హీరో, హీరోయిన్లు హాజరయ్యారు. సైమా అవార్డుల్లో సత్తా చాటింది దసరా మూవీ. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ అవార్డులను సొంతం చేసుకుంది.
హాయ్ నాన్న సినిమా 5 అవార్డులు దక్కించుకోగా, దసరా సినిమాకు 4 అవార్డులు, బేబీ సినిమా 3 అవార్డులు సాధించాయి. సైమా వేడుకల్లో నానికి సంబంధించిన రెండు సినిమాలు సత్తా చాటడం విశేషం.
()బెస్ట్ యాక్టర్ – నాని(దసరా)
()బెస్ట్ యాక్ట్రెస్ – కీర్తి సురేష్(దసరా)
()బెస్ట్ డైరెక్టర్ – శ్రీకాంత్ ఓదెల(దసరా)
()బెస్ట్ ఫిలిం – భగవంత్ కేసరి
()బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – దీక్షిత్ శెట్టి(దసరా)
()బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – బేబీ ఖియారా ఖాన్(హాయ్ నాన్న)
()బెస్ట్ కమెడియన్ – విష్ణు(మ్యాడ్)
()బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ – వైష్ణవి చైతన్య(బేబీ)
()బెస్ట్ డెబ్యూట్ యాక్టర్ – సంగీత్ శోభన్(మ్యాడ్)
()బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ – శౌర్యువ్(హాయ్ నాన్న)
()బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – అబ్దుల్ వాహబ్(హాయ్ నాన్న, ఖుషి)
()బెస్ట్ సినిమాటోగ్రఫీ – భువన గౌడ(సలార్)
()బెస్ట్ సింగర్ – రామ్ మిర్యాల(ఊరు పల్లెటూరు – బలగం)
()బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ – ఆనంద్ దేవరకొండ(బేబీ)
()బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – మృణాల్ ఠాకూర్(హాయ్ నాన్న)
()బెస్ట్ డైరెక్టర్ క్రిటిక్స్ – సాయి రాజేష్(బేబీ)
()బెస్ట్ డెబ్యూట్ ప్రొడ్యూసర్స్ – వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్(హాయ్ నాన్న)
